Meera Jasmine పొట్టి నిక్కరులో జిమ్ లో బాగానే కష్ట పడుతున్న రవి తేజ హీరోయిన్… అందుకేనా…?

Joythi R

Meera Jasmine తెలుగులో ప్రముఖ హీరో రవితేజ హీరోగా నటించిన భద్ర అనే చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి హిట్టయిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మీరా జాస్మిన్ కూడా తన ఎమోషనల్ మరియు సెంటిమెంటల్ పాత్రలో నటించి ప్రేక్షకులను కట్టిపడేసింది. దీంతో భద్ర చిత్రంలో నటించిన తర్వాత నటి మీరా జాస్మిన్ టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ పెరిగిపోయింది. కానీ నటి మీరా జాస్మిన్ మాత్రం తన తదుపరి చిత్రాల కథల విషయంలో మరియు పాత్రల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోక పోవడంతో తన క్రేజ్ ని నిలబెట్టుకోలేక పోయింది. అంతేకాకుండా కెరియర్ ని కూడా కాపాడుకోలేక పోయింది. దీంతో తన వైవాహిక జీవితం పై దృష్టి సారించి ఓ ప్రముఖ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ ఈ బంధం కూడా ఎక్కువ రోజులు నిలబడలేదు.

దీంతో నటి మీరా జాస్మిన్ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి మళ్లీ అవకాశాలు చేజిక్కించుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలో మంచి ఫిజిక్ మరియు పర్సనాలిటీ మెయింటెన్ చేయాలని ఏకంగా జిమ్ వర్కౌట్లు అలాగే ప్రత్యేక ఆహార డైట్ వంటివి పాటిస్తూ బాగానే శ్రమిస్తోంది. అయితే తాజాగా నటి మీరా జాస్మిన్ జిమ్ లో వర్కౌట్లు చేస్తూ తీసినటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీంతో ఒక్కసారిగా ఈ అమ్మడి హార్డ్ వర్క్ కి నెటిజన్లు ఫిదా అయ్యారు. అంతేకాకుండా హీరోయిన్ మీరా జాస్మిన్ కి 40 ఏళ్ల వయసు పైబడినప్పటికీ అందం అభినయం మాత్రం ఏ మాత్రం తగ్గలేదని కాబట్టి ఇప్పటికీ సరిగ్గా ప్రయత్నిస్తే మళ్ళీ హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంటుందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Meera Jasmine పొట్టి నిక్కరులో జిమ్ లో బాగానే కష్ట పడుతున్న రవి తేజ హీరోయిన్... అందుకేనా...?
Meera Jasmine పొట్టి నిక్కరులో జిమ్ లో బాగానే కష్ట పడుతున్న రవి తేజ హీరోయిన్… అందుకేనా…?

అయితే ఈ విషయం ఇలా ఉండగా తన ఫస్ట్ ఇన్నింగ్స్ లో ఎక్స్ పోజింగ్ కి దూరంగా ఉంటూ చాలా సాంప్రదాయబద్ధంగా కనిపించిన మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం వరుస ఫోటో షూట్లలో పాల్గొంటూ ఘాటుగా ఫోజులిస్తూ కుర్రకారు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. కాగా ప్రస్తుతం నటి మీరా జాస్మిన్ మలయాళంలో ప్రముఖ హీరో జయరామ్ హీరోగా నటిస్తున్న చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ విడుదల కాగా మంచి రెస్పాన్స్ వస్తోంది.

- Advertisement -