Mega Daughters: మెగా కుటుంబంలో అమ్మాయిలకు శాపం ఉందా.. ఆ అవమానాలు తప్పవా?

Akashavani

Mega Daughters:తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరో కుటుంబంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న మెగా కుటుంబం గురించి అందరికీ తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి సపోర్ట్ లేకుండా స్వయంకృషితో ఇండస్ట్రీలో నిలదొక్కుకొని ప్రస్తుతం ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఇక మెగా కుటుంబం నుంచి పలువురు హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి వారు కూడా మంచి గుర్తింపు పొందారు. ఇలా మెగా వారసుల కెరియర్ ఎంతో అద్భుతంగా కొనసాగుతున్నప్పటికీ మెగా వారసురాళ్ళ జీవితాలు మాత్రం మంచిగా లేవనే చెప్పాలి. ఈ క్రమంలోనే మెగా డాటర్స్ విషయంలో నిత్యం ఏదో ఒక ఇష్యూ జరుగుతూనే ఉంది.

మెగాస్టార్ చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత మొదట ఉదయ్ కిరణ్ ని పెళ్లి చేసుకోవాలని భావించారు.ఈ క్రమంలోనే ఉదయ్ కిరణ్ తో ఎంతో అంగరంగ వైభవంగా నిశ్చితార్థం కూడా జరిపించారు. ఈ విధంగా నిశ్చితార్థం జరిగిన తరువాత వీరి వివాహం క్యాన్సిల్ కావడంతో సుస్మిత గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. ఇక రెండవ కూతురు శ్రీజ గురించి నిత్యం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. ఇక తన భర్తతో గొడవలు రావడంతో మొదటి భర్తకు విడాకులు ఇచ్చి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తిని రెండవ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం అతనితో కూడా ఈమెకు మనస్పర్థలు రావడంతో కళ్యాణ్ దేవ్ నుంచి శ్రీజ దూరంగా ఉంటున్నారు. త్వరలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు వచ్చాయి.

Mega Daughters: కొణిదెల ఆడపడుచులకు శాపమా…

ఇక మెగా బ్రదర్ నాగబాబు కుమార్తె నిహారిక కూడా ఇండస్ట్రీలోకి యాంకర్ గా ఎంట్రీ ఇచ్చి అనంతరం హీరోయిన్ గా కొనసాగారు. మెగా కాంపౌండ్ నుంచి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వన్ అండ్ ఓన్లీ డాక్టర్ గా నిహారిక గుర్తింపు పొందారు. అయితే ఈమె నటించిన సినిమాలు అట్టర్ ఫ్లాప్ గా నిలిచాయి.ఇక సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక జొన్నలగడ్డ వెంకట చైతన్య అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్నారు.అయితే ఈమె వైవాహిక జీవితంలో కూడా మనస్పర్ధలు మొదలయ్యాయని అందుకే తన భర్త చైతన్య నుంచి దూరంగా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇలా నిహారిక వైవాహిక జీవితంలో కూడా సమస్యలు మొదలవడమే కాకుండా ప్రస్తుతం డ్రగ్స్ వ్యవహారంలో నిహారిక అరెస్ట్ కావడం సంచలనంగా మారింది. ఈ విధంగా మెగా ఆడపడుచుల జీవితాలలో ఏదో ఒక సమస్యతో పాటు వైవాహిక జీవితంలో కూడా సమస్యలు రావడంతో వీరి జాతకంలో ఏదైనా శాపం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే వీరి జీవితంలో జరిగిన సంఘటనలే ఇలాంటి అనుమానాలకు దారి తీస్తున్నాయని చెప్పవచ్చు.

- Advertisement -