Mega Family: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఎవరి సపోర్టు లేకుండా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగిన చిరంజీవి ఆ తర్వాత తన కుటుంబం నుండి ఎంతోమందిని హీరోలుగా ఇండస్ట్రీకి పరిచయం చేశాడు. ఇలా మెగా కుటుంబం నుండి వచ్చిన హీరోలందరూ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సొంతం చేసుకొని మెగా కుటుంబం పరువు, ప్రతిష్టలు పెంచుతున్నారు. అయితే మెగా కుటుంబానికి చెందిన ఆడపిల్లలు మాత్రం ఆ కుటుంబం పరువు తీసే పని చేస్తున్నారు.
ఇప్పటికే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ రెండుసార్లు పెళ్లిళ్లు చేసుకుని ఇద్దరు భర్తలకు విడాకులు ఇచ్చింది. దీంతో ఇప్పటికీ శ్రీజ గురించి అనేక విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల నాగబాబు కుమార్తె నిహారిక కూడా తన భర్త చైతన్యకి విడాకులు ఇవ్వబోతున్నట్లు ప్రకటించింది. దీంతో ప్రస్తుతం నిహారిక విడాకుల వార్తలు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇదిలా ఉండగా మెగా కుటుంబానికి అల్లుడుగా వెళ్లాలనుకునే వారు కొన్ని కండిషన్లు ఫాలో అవ్వాలంటే సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ గా మారింది.
Mega Family: వారికి ఫ్రీడమ్ ఇవ్వాల్సిందే…
ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి మంచి పేరు ఉండటంతో ఆ కుటుంబానికి చెందిన ఆడపిల్లలను పెళ్లి చేసుకోవాలనుకునే వారు వారి కండిషన్లను అంగీకరించాలి లేదంటే విడాకులు తప్పవు అంటూ ప్రస్తుతం ఒక వార్త వైరల్ గా మారింది. ఎందుకంటే చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెట్టిన కండిషన్లకు కళ్యాణ్ దేవ్ ఒప్పుకోకపోవడం వల్లే ఇద్దరి మధ్య గొడవలు జరిగి విడాకుల వరకు వెళ్ళింది. నిహారిక కూడా శ్రీజా లాగే చైతన్యకి కండిషన్స్ పెట్టడంతో నిహారికకి విడాకులు ఇవ్వటానికి చైతన్య సిద్ధపడినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా కూతుర్ల విడాకుల వార్తల వల్ల మెగా కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తోంది. వారు పెట్టే కండిషన్ ఏంటంటే వారికి ఫ్రీడం ఇవ్వాలి వారి ఇంటికి ఇల్లరికం రావాలి, వారు చెప్పినదే వినాలి అనే కండిషన్స్ పెట్టడంతోనే వీరికి విడాకులు వచ్చాయంటూ కామెంట్ చేస్తున్నారు.