Mega Hero:మెగా కాంపౌండ్ నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలో కొనసాగుతూ ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో మెగా హీరో అని టాగ్ తగిలించుకొని వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి వారిలో నటుడు సాయి ధరంతేజ్ ఒకరు. ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ అయ్యారు. తాజాగా ఈయన బ్రో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదిలా ఉండగా సాయి ధరంతేజ్ కు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సాధారణంగా ఎవరికైనా కోపం వచ్చిన ఏదైనా టెన్షన్ కారణంగా మూడ్ ఆఫ్ అయినా కొంత సమయం పాటు ఎవరిని కలవకుండా ఒంటరిగా ఉంటే ఆ ఫ్రస్టేషన్ నుంచి బయటపడుతుంటారు అయితే మెగా హీరో సాయి ధరంతేజ్ మాత్రం ఇందుకు పూర్తిగా భిన్నమని తెలుస్తుంది.ఈయన ఏదైనా బాధలో ఉన్న లేదా ఎవరి పట్లైనా కోపంగా ఉన్న ఇక షూటింగ్ కు వెళ్లాలని ఇంట్రెస్ట్ లేకపోయినా వెంటనే తన మొబైల్ ఫోన్ ఆన్ చేసి అందులో కామెడీ వీడియోలను చూస్తారట. ఈ వీడియోలు చూసినప్పుడు ఆటోమేటిక్ గా తన మూడ్ ఆఫ్ నుంచి బయటకు వస్తూ చక చకా తన పనులలో నిమగ్నం అవుతారని తెలుస్తోంది.

Mega Hero: ఆ వీడియోలు అంటే అంత ఇష్టమా…
ఇక షూటింగ్ లొకేషన్స్ లో కూడా కొందరి కారణంగా ఈయన ఫ్రస్టేషన్ కి గురవుతే వెంటనే ఒంటరిగా కూర్చుని మొబైల్ ఫోన్లో ఇలాంటి కామెడీ వీడియోలు చూస్తారట. ఇలా కామెడీ వీడియోలు చూసినప్పుడు ఆటోమేటిక్గా తాను సెట్ అవుతారంటూ ఓ వార్త వైరల్ గా మారింది.అయితే సాయి ధరం మొదటి నుంచి కూడా ఇలాంటి కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలోనే నటిస్తుంటారు. ఇక ఈయన ఏ ఇంటర్వ్యూలో పాల్గొన్న చాలా కామెడీ చేస్తూ నవ్వుతూ అందరిని నవ్విస్తూ మాట్లాడుతూ ఉంటారు.ఇలా తనకు మూడ్ ఆఫ్ అయినప్పుడు ఇలాంటి కామెడీ వీడియోలు చూస్తే తాను రిఫ్రెష్ అవుతారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అసలు ఇదేం అలవాటు అంటుకొందరు సాయిధరమ్ తేజ్ గురించి వస్తున్నటువంటి ఈ వార్తలపై స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.