Mega Heros: మెగాస్టార్ చిరంజీవి మొదలుకొని ఆయన అల్లుడు కళ్యాణ్ దేవ్ వరకు దాదాపు అందరూ కలిసి పదిమంది వరకూ ఉన్నారు. మెగాస్టార్ తర్వాత నాగబాబు, నటుడిగా నిర్మాతగా నిలదొక్కుకున్నారు. ఆ తర్వాత ఈ ఫ్యామిలీ నుంచి పవన్ కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇచ్చి పవర్ స్టార్‌గా అసాధారణమైన పాపులారిటీని సాధించుకున్నాడు. ఇలా టాలీవుడ్‌లో ఉన్న బిగ్ ఫ్యామిలీ మెగా వారిదే కావడం విశేషం. ఎప్పుడూ కలిసి ఉండే వారిలో అల్లు ఫ్యామిలీ వేరంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు.
ఇక మెగా సోదరులలో పవన్ కళ్యాణ్ కూడా ఎప్పుడూ ఫ్యామిలీ ఫంక్షన్స్‌కు దూరంగా ఉంటాడనే టాక్ ఉంది. నాగబాబు కూడా కొన్ని సందర్భాలలో వేదిక మీద స్వయంగా చెప్పారు. కానీ, ఇటీవల ఇంట్లో ఏ ఫంక్షన్ జరిగినా పవన్ అటెండ్ అవుతున్నాడు. ఇక ఆయన సినిమాలు చేస్తూనే జనాలకు సేవ చేయాలని జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. గత ఎనికల్లో ఘోరంగా ఓడిపోయిన పవన్ కళ్యాణ్ దానికి కారణాలేంటో పరిశీలించారు. అందుకే, ఇప్పుడు పక్కా ప్రణాళికతో 2024 ఎన్నికల్లో సీఎం అయ్యేందుకు గట్టిగా సన్నాహాలు చేస్తున్నారు.
Mega Heros: అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లేరా..?
ఈ నేపథ్యంలో పవన్ ఇప్పటికే, పలు సేవా కార్యక్రమాలు, పార్టీ మీటింగులను నిర్వహిస్తున్నారు. సభలల్లో గతంలో మాదిరిగా కాకుండా ఇప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుతున్నారు. అయితే, పవన్‌కు సపోర్ట్‌గా అల్లు అర్జున్ ఉండటం లేదా..మిగతా మెగా హీరోలు ఏమయ్యారు అని ప్రచారం చేస్తున్నారు. దీనికి కారణం తాజాగా విజయవాడలో సభ ఏర్పాటు చేసుకున్న మెగా అభిమానులు మెగా సోదరులతో పాటు చిరంజీవి కొడుకు హీరో రామ్ చరణ్ ఫొటోను మాత్రమే వేసుకున్నారు. దాంతో అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ లేరా.. అని మాట్లాడుకుంటున్నారు. దీనిపై మెగా హీరోలు ఎలా స్పందిస్తారో చూడాలి.