Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి ఎలాంటి అంచనాలు లేకుండా నటనపై ఆసక్తితో తన టాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు మెగాస్టార్ చిరంజీవి.కెరీర్ మొదట్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్న ఈయన ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా తన టాలెంట్ ను నమ్ముకొని ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నించారు.ఇలా కెరీర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలు విలన్ గా నటించిన మెగాస్టార్ చిరంజీవిలో ఉన్న టాలెంట్ గుర్తించిన కొందరు దర్శక నిర్మాతలు ఈయనను హీరోగా పరిచయం చేశారు.ఈ విధంగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అనంతరం ఆయన వరుస విజయాలతో దూసుకుపోవడం చూసి దర్శకనిర్మాతలు ఆశ్చర్యానికి గురయ్యారు.
ఏకంగా అయిదారు సినిమాలు వరుస హిట్లతో దూసుకుపోగా మెగాస్టార్ చిరంజీవి విజయాన్ని చూసి కొందరు ఓర్వలేక అతనిపై శత్రుత్వం పెంచుకున్నారు. ఒకానొక సమయంలో అతనిని చంపేయాలని విషప్రయోగం కూడా చేశారు. మరణ మృదంగం సినిమా షూటింగ్ సమయంలో మెగాస్టార్ చిరంజీవికి కేక్ లో విషం పెట్టి అతనిపై విష ప్రయోగం చేసిన సంఘటన అప్పట్లో పెద్ద ఎత్తున సంచలనం సృష్టించింది. మద్రాసులో ఈ సినిమా షూటింగ్ జరిగే సమయంలో మేనేజర్ వచ్చి బయట మీ కోసం అభిమానులు చాలా సేపటినుంచి ఎదురు చూస్తున్నారు అని చెప్పారు.
అలా అభిమానులు ఎదురు చూస్తున్నారు అని తెలియడంతో ఒకసారి వెళ్లి హాయ్ చెప్పాలని చిరంజీవి గేట్ వరకు వెళ్లారు.చిరంజీవి అలా వెళ్ళగానే ఒక అభిమాని అతని కాళ్లపై పడి ఈ రోజు నా పుట్టినరోజు తప్పనిసరిగా మీరు పక్కనుండి కేక్ కట్ చేయించాలి అని చెప్పారు.అభిమాని బ్రతిమిలాడడంతో చిరంజీవి కాదనలేక తన పక్కన నిలబడి కేక్ కట్ చేయించి తనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసిన అభిమాని చిరంజీవి కేక్ తినిపించాలని ప్రయత్నం చేశాడు. చిరంజీవి తాను తినని ప్రస్తుతం సినిమా షూటింగ్ లో ఉన్నాను కనుక తినను అని చెప్పారు. చిరంజీవి వద్దంటున్న అభిమాని చిరంజీవి నోట్లో కేక్ పెట్టారు.చిరంజీవి వద్దంటూ కింద పడేశారు. ఆ పెనుగులాటలో కేక్ మొత్తం కిందపడిపోయింది. అయితే ఆ కేక్ లో మధ్యలో రంగు అధికంగా ఉండేసరికి చిరంజీవికి అనుమానం వచ్చి నోరు మొత్తం కడుక్కున్నారు. అప్పటికే అతని పెదాలు మొత్తం నీలం రంగులోకి మారాయి.
Chiranjeevi: పెదాలు మొత్తం నీలి రంగులోకి మారాయి
ఇక తన పెదాలు నీళ్ళు రంగులోకి మారడంతో అసిస్టెంట్ మీ పెదాలకు లిప్స్టిక్ వేసిన రంగు మారాయి అని చెప్పగా వెంటనే ఈ విషయం దర్శకనిర్మాతలకు తెలిపి హడావుడిగా ఆస్పత్రికి వెళ్లారు. తనపై విషప్రయోగం జరిగిందని డాక్టర్లు చెప్పగానే ఒక్కసారిగా మెగాస్టార్ షాక్ అయ్యారు.ఇక ఆ విషం ఒళ్ళంతా పాకకుండా ఉండడం కోసం ఆ రోజు రాత్రి ఆయన ఆస్పత్రిలో ఉండి చికిత్స చేయించుకున్నారు. మరుసటి రోజు ఉదయానికి పెదాలు యధావిధిగా ఉండడంతో మెగాస్టార్ ఈ ఘటన నుంచి బయట పడ్డారు.ఇలా మెగాస్టార్ తెలివిగా ప్రవర్తించడం వల్ల ఆయన ప్రాణాలతో బయటపడ్డారు అప్పట్లో ఈ వార్త పెద్ద సంచలనంగా మారింది.