Sreeja: చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఎంతో పాపులర్ అయిందని చెప్పాలి. ఈమె తన వ్యక్తిగత విషయాలు వల్ల వార్తలలో నిలబడమే కాకుండా మెగాస్టార్ పరువు ప్రతిష్టలకు కూడా కాస్త ఇబ్బందులను కలిగించారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. శ్రీజ మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని ప్రేమించి కుటుంబ సభ్యులకు తెలియకుండా ఇంటి నుంచి వెళ్లిపోయి అతనిని పెళ్లి చేసుకున్నారు. ఇక పెళ్లి చేసుకున్నటువంటి వీరిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించింది.
అయితే పాప పుట్టిన తర్వాత తన భర్తతో వచ్చిన విభేదాలు కారణంగా ఈమె విడాకులు తీసుకొని విడిపోయారు. విడాకుల తర్వాత శ్రీజ తన కుమార్తెతో కలిసి చిరంజీవి ఇంటికి రావడంతో ఆయన తన సమీప బంధువులు అయినటువంటి కళ్యాణ్ దేవ్ అనే వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరి వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఇక ఈ దంపతులకు కూడా మరొక కుమార్తె జన్మించింది. అయితే వీరిద్దరి మధ్య వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకుని విడిపోయారు. ఇద్దరు విడాకులు తీసుకొని విడిపోగా వీరి కుమార్తె అప్పుడప్పుడు తన తండ్రి వద్దకు వెళుతూ ఉంటుంది.
శ్రీజ కళ్యాణ్ కలవబోతున్నారా…
తాజాగా దీపావళి పండుగను కూడా శ్రీజ చిన్న కుమార్తె తన తండ్రి వద్ద జరుపుకున్నట్లు కళ్యాణ్ దేవ్ ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈయన సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూస్తుంటే మాత్రం త్వరలోనే శ్రీజ కళ్యాణ్ ఇద్దరు కలిసిపోతున్నారని స్పష్టంగా అర్థం అవుతుంది. వీరిద్దరూ మధ్య ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోయి వారి తప్పులను తెలుసుకున్నారని దీంతో త్వరలోనే తిరిగి కలవబోతున్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు రావడమే కాకుండా వీరి పోస్టులు కూడా అందరికీ ఇదే అనుమానాలను కలిగిస్తున్నాయి. ఏమైనా వీరిద్దరూ కలిసి పోతే బాగుంటుందని మెగా ఫాన్స్ కూడా కోరుకుంటున్నారు.