Megastar Chiranjeevi: సాధారణంగా సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత హీరో హీరోయిన్ల గురించి ఎన్నో రకాల వార్తలు వారి గురించి వినపడుతూ ఉంటాయి. ఒక సినిమాలో హీరో హీరోయిన్ నటించిన ఆ సినిమా మంచి విజయం అందుకుంటే తిరిగి వారిద్దరూ మరొక సినిమాలో కలిసిన నటించడం సర్వసాధారణం.ఇలా ఒకే జోడి పలు సినిమాలలో నటించగా వారిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తాయి. ఇకపోతే గతంలో ఎంతో మంది హీరో హీరోయిన్లకు సంబంధించిన ఇలాంటి వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఇకపోతే తాజాగా సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ ఇంటర్వ్యూలో పాల్గొని ఆశక్తికరమైన విషయాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈయన మాట్లాడుతూ అప్పట్లో కొందరు సెలబ్రిటీల గురించి వచ్చిన రూమర్ల గురించి ప్రస్తావించారు.ప్రస్తుతం అయితే సోషల్ మీడియా అభివృద్ధి చెందడం వల్ల ప్రతి ఒక్కరికి సంబంధించిన వార్తలు క్షణాలలో తెలిసిపోతున్నాయి. అయితే అప్పట్లో కేవలం కొన్ని వార్తాపత్రికలు ఇలాంటి రూమర్స్ రాయడానికి మాత్రమే ఉండేది. ఆ వార్తాపత్రికలో ప్రతివారం ఇలాంటి సినీ సెలబ్రెటీలకు సంబంధించిన రూమర్స్ ప్రచురితం అయ్యేదని ఈయన తెలిపారు.
Megastar Chiranjeevi: ఇలాంటి రూమర్లకోసమే ఓ వార్త సంచిక ఉండేది…
ఈ క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మెగాస్టార్ చిరంజీవి గురించి కూడా అప్పట్లో ఇలాంటి రూమర్లు వచ్చాయని ఈయనకి నటి సుమలతతో ఎఫైర్ ఉందని వార్తలు అప్పట్లో పెద్ద ఎత్తున చెక్కర్లు కొట్టాయి. ఈ విధంగా ఎంతోమంది సినిమా సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు వచ్చేవని జర్నలిస్టు భరద్వాజ్ వెల్లడించారు.ఇకపోతే ఇంటర్వ్యూ సందర్భంగా ఆయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్, భోళా శంకర్ వంటి సినిమా షూటింగులతో బిజీ బిజీగా గడుపుతున్నారు.