Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు అందరిని ఆహ్వానించి ఈయన ఘనంగా పార్టీ ఇవ్వడమే కాకుండా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చి చిత్ర పరిశ్రమకు గర్వకారణంగా నిలిచినటువంటి రాజమౌళి,ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి ఈయన పెద్ద ఎత్తున సత్కారం చేశారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆర్ఆర్ఆర్ టీమ్ కు ఆస్కార్ అవార్డు రావడానికి కారణమైనటువంటి వారందరికీ ఈయన శాలువాలు కప్పి పూల బొకేలతో సన్మానించి ఘనంగా పార్టీ ఇచ్చారు.
ఈ క్రమంలోనే రాజమౌళి దంపతులతో పాటు కీరవాణి దంపతులను సత్కరించారు అలాగే సింగర్స్ రాహుల్ సిప్లగంజ్, కాలభైరవ, కార్తికేయ, ప్రేమ్ రక్షిత్ వంటి వారందరికీ ఈయన సన్మానం చేశారు. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడానికి కారణమైనటువంటి వీరందరికీ రాజమౌళి ఘనంగా పార్టీ ఇచ్చారు.. అలాగే నిర్మాత దానయ్యను కూడా సత్కరించారు. ఇక రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా శ్రీకాంత్ వెంకటేష్ నాగార్జున దంపతులతో పాటు నాగచైతన్య, అడవి శేషు, విజయ్ దేవరకొండ వంటి పలువురు సెలబ్రిటీలు అందరూ కూడా ఈ పుట్టినరోజు కార్యక్రమాలకు హాజరయ్యారు.
Megastar Chiranjeevi: హాజరైన టాలీవుడ్ సెలబ్రిటీలు…
ఇలా టాలీవుడ్ సెలబ్రిటీలందరూ కూడా మెగా కాంపౌండ్ లో వాలిపోయి చరణ్ పుట్టినరోజు వేడుకలను ఎంతో ఘనంగా చేశారు మంచు మనోజ్ భూమ మౌనిక అలాగే మంచు లక్ష్మి కూడా చరణ్ పుట్టినరోజు వేడుకలలో సందడి చేశారు.రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన ఆరెంజ్ సినిమాని తిరిగి విడుదల చేయగా ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను సాధించి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సినిమా మొదట్లో విడుదలైనప్పుడు ఎలాంటి కలెక్షన్స్ లేకుండా భారీ నష్టాలను ఎదుర్కొంది అయితే రీ రిలీజ్ తర్వాత ఈ సినిమా కలెక్షన్లను చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.