Mehaboob Dil Se: తెలుగు ప్రేక్షకులకు మెహబూబ్ దిల్ సే బాగా పరిచయం. రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4 లో కంటెస్టెంట్ గా అడుగుపెట్టి అందులో తన ప్రవర్తనతో అందరిని అభిమానులుగా మార్చుకున్నాడు. ఈయన మొదట యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్, కవర్ సాంగ్స్ చేస్తూ ఉండేవాడు. అలా ఆయన నటనకు ఎంతోమంది సోషల్ మీడియా ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా ఆయన డాన్స్ మాత్రం బాగా హైలైట్ అని చెప్పవచ్చు. తన డాన్స్ తో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు మెహబూబ్.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటాడు మెహబూబ్. తన డాన్స్ వీడియోలతో బాగా సందడి చేస్తుంటాడు. ఇక ఈయన బుల్లితెరపై పలు షోలల్లో కనిపించాడు. అయితే ప్రస్తుతం స్టార్ మా లో బిబి డాన్స్ జోడి ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో మొదటి నుండి ఇప్పటివరకు పూర్తయిన సీజన్ ల కంటెస్టెంట్లు అందరు పాల్గొని తమ డాన్స్ వీడియోలతో బాగా సందడి చేస్తున్నారు. అందులో మెహబూబ్ దిల్ సే కూడా ఒకరు.
ఇక ఈయన డాన్స్ పెర్ఫార్మెన్స్ కి మాత్రం బుల్లితెర ప్రేక్షకులు కూడా ఫిదా అవుతున్నారు. ఈయనకు జోడిగా అషు రెడ్డి ఉండేది. కానీ తాజాగా విడుదలైన ప్రోమో లో ఈయన ఒక్కడే డాన్స్ చేస్తూ కనిపించాడు. తాజాగా వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో కంటెస్టెంట్ లు తమ పర్ఫామెన్స్ తో బాగా సందడి చేసినట్లు కనిపించారు.
Mehaboob Dil Se: తల్లిని కోల్పోయిన మెహబూబ్..
ఇక చివర్లో మెహబూబ్ కూడా తన పర్ఫామెన్స్ తో బాగా అదరగొట్టాడు. ఆ సమయంలో శ్రీముఖి జడ్జిలతో అతడు రీసెంట్గా తన తల్లిని కోల్పోయాడు అని చెప్పటంతో జడ్జిలు షాక్ అయ్యారు. ఇక మహబూబ్ మాత్రం కంటనీరు పెట్టుకుంటూ బాగా ఎమోషనల్ గా కనిపించాడు. తన తల్లి తనను మధ్యలో వదిలేసి వెళ్ళింది అంటూ.. ఇక తనకు తన తల్లి చెప్పిన మాటలను చెబుతూ అందరి హృదయాలను కదిలించాడు. ప్రస్తుతం ఆ ప్రోమో బాగా వైరల్ అవుతుంది.