Mehreen Pirzada: కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి మెహరీన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమా తర్వాత రాజా ది గ్రేట్, ఎఫ్ 2 వంటి వరుస బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను సందడి చేసిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరొక హిట్ తన ఖాతాలో వేసుకున్న మెహరీన్ కన్నడ సినిమాతో పాటు స్పార్క్ అనే చిత్రంలో కూడా నటిస్తోంది. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.
ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ పెద్ద ఎత్తున అభిమానులను ఆకట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈమె నిత్యం ట్రెండీ వేర్, ట్రెడిషనల్ లుక్ లో సందడి చేస్తూ ఉంటారు. ఇకపోతే రెండు రోజుల క్రితం ఈ ముద్దుగుమ్మ ట్రెండీ వేర్ ధరించి అందాలను ఆరబోస్తూ అభిమానులను, కుర్రకారులను ఫిదా చేసింది. ఇలా ఒకప్పుడు ఎంతో బొద్దుగా ఉన్నటువంటి మెహరీన్ తాజాగా తన ఫిట్నెస్ పై దృష్టి సారించి నాజుగ్గా తయారయ్యారు.ఇలా ట్రెండీ వేర్ లో అందాలను ఆరబోస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా మరొక ఫోటోని షేర్ చేశారు.
Mehreen Pirzada: వరుస సినిమాలతో బిజీగా ఉన్న మెహరీన్…
ఇక ఈ ఫోటోలలో అచ్చం కుందనపు బొమ్మల ఉండి అందరిని ఆకట్టుకుంటుంది. బాపు బొమ్మల ఈమె లంగా వోని ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఓ కార్యక్రమంలో భాగంగా సాంప్రదాయ దుస్తులు అయిన లంగా వోని ధరించిన ఈమె అందరి దృష్టిని ఆకర్షించింది.ఈ క్రమంలోని ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతోమంది ఈమె అందానికి ఫిదా అవుతున్నారు. ఇకపోతే మెహరీన్ గతంలో నిశ్చితార్థం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే అయితే కొన్ని కారణాలవల్ల ఈమె నిశ్చితార్థం క్యాన్సిల్ కావడం, తన కెరియర్ పై ఫోకస్ చేసే ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఈమె షేర్ చేసిన ఈ రెండు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.