Microsoft Windows 11 : మైక్రోసాఫ్ట్ సంస్థ తమ సరికొత్త ఓఎస్ విండోస్‌ 11ను విడిదల చేసిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 11 ను వినియోగదారులకు మరింత సౌకర్యంగా ఉండేడట్టు తీర్చిదిద్దింది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది వినియోగదారులు విండోస్ 11 ను ఉపయోగిస్తున్నారు. విండోస్ 11లో యాప్‌ ఐకాన్స్‌, ఆండ్రాయిడ్ యాప్‌ సపోర్ట్‌, మల్టీ టాస్కింగ్ లేవుట్స్‌, ఆటో అప్‌డేట్‌, గేమర్స్‌ కోసం ఆటో హెచ్‌డీఆర్‌ వంటి ఎన్నో రకాల ఫీచర్లను వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ ఓఎస్‌ను ఉపయోగించలంటే పీసీ/కంప్యూటర్లలో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్ లు ఉండక తప్పదు అని మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. అయితే మైక్రోసాఫ్ట్ సూచించిన ఫీచర్లు లేని పీసీ/కంప్యూటర్లలో కూడా విండోస్‌ 11ను చాలా మంది ఇన్‌స్టాల్ చేయడం జరిగింది.

ఆరంభంలో దీనిపై ఎక్కువగా దృష్టి సారించని మైక్రోసాఫ్ట్, ఇటీవల దీనికి సంబంధించి కీలక ప్రకటన చేయడం జరిగింది. మైక్రోసాఫ్ట్ సూచించిన కనీస ఫీచర్లు లేకుండా విండోస్‌ 11ను ఉపయోగించే యూజర్లకు డెస్క్‌టాప్ నోటిఫికేషన్‌ ద్వారా హెచ్చరిక జారీ చేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. ‘‘విండోస్‌ 11తో పనిచేసేందుకు మీ సిస్టమ్‌ రిక్వైర్‌మెంట్స్ సరిపోవు’’ అనే హెచ్చరిక యూజర్‌కు తమ పీసీ/కోమపుటర్లలో కనిపించనుంది. విండోస్‌ 11 ఉపయోగించడానికి కంప్యూటర్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండాలనేది ఆ హెచ్చరిక పక్కనే ఉన్న ‘లెర్న్‌ మోర్‌’ అనే లింక్ పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. మైక్రోసాఫ్ట్ త్వరలోనే దీనిని అమలులోకి తీసుకురానుంది

ధీర్ఘ కాలం పాటు తమ కంప్యూటర్‌ ఫీచర్లు అప్‌గ్రేడ్ చేయకుండా విండోస్‌ 11ను ఉపయోగించాలనుకుంటే, భవిష్యత్తులో మైక్రోసాఫ్ట్ విడుదల చేసే ఓఎస్‌ అప్‌డేట్‌లు ఆ కంప్యూటర్లలో పనిచేయవని మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది.దాని వల్ల భవిష్యత్తులో జరిగే సైబర్‌ దాడుల నుంచి వినియోగదారుడి సమాచారానికి ఎటువంటి రక్షణ ఉండదని మైక్రోసాఫ్ట్ సంస్థ వెల్లడించింది. విండోస్‌ 11 ఓఎస్‌ మీ సిస్టమ్ లో ఇన్‌స్టాల్‌ లేదా అప్‌డేట్‌ చేయాలనుకుంటే సిస్టమ్‌ 64 బిట్‌ అయి ఉండాలి. 1 జీహెచ్‌జెడ్‌ డ్యూయల్‌ కోర్‌ ప్రాసెసర్‌తో తో పాటు కనీసం 4జీబీ ర్యామ్‌, 64 జీబీ ఫ్రీ ‌స్టోరేజీ ఉండకతప్పదు అని మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రకటించింది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on ఫిబ్రవరి 18, 2022 at 12:43 సా.