Miheeka: సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన రానా గురించి తెలియని వారంటూ ఉండరు. లీడర్ సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రానా బాహుబలి సినిమా ద్వారా పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నాడు. రానా కేవలం హీరోగా మాత్రమే కాకుండా నటనకు ప్రాధాన్యత ఉన్న వివిధ పాత్రలలో నటిస్తున్నాడు. ఈ క్రమంలో పలు సినిమాలలో విలన్ గా కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రానా భార్య మిహికా గురించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. 2020లో రానా తన ప్రేయసి మిహీక బజాజ్ ని వివాహం చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు బంధుమిత్రుల మధ్య వీరీ వివాహ వేడుక ఎంతో ఘనంగా జరిగింది.
మిహిక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా మిహీకా మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రజల కోసం ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో ఆర్గనైజేషన్ తో కలసి కొన్ని సహాయ కార్యక్రమాలు చేస్తోంది. భారత దేశంలో మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం కూడా లేని గ్రామాల్లో నివసిస్తున్న పేద ప్రజల కోసం ఎన్జీవో ఆర్గనైజేషన్ తో కలసి సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్ పంపిణి చేస్తున్నారు. తాజాగా ఈ విషయాన్ని మిహీకా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. పేద వారి ఇళ్లల్లో వెలుగులు నింపటానికి ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో ఆర్గనైజేషన్తో కలిసి మిహిక చేస్తున్న సహాయ కార్యక్రమాలకు అందరూ అభినందిస్తున్నారు.
Miheeka గొప్ప పని చేస్తున్న మిహీకా…
మారుమూల గ్రామాలలో విద్యుత్ సదుపాయం లేక అవస్థలు పడుతున్న పేద ప్రజలకు సహాయం చేయటానికి సహకారం అందిస్తూ వారి జీవితాలలో వెలుగులు నింపిన రానా, మిహీకా థాంక్యూ అంటూ ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో కామెంట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉండగా. మిహీక సోషల్ మీడియాలో చాలా యక్టీవ్ గా ఉంటుంది. తరచూ భర్త రానా ,స్నేహితులతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా సముద్రతీరాన సేద తీరుతున్న ఫోటోలను మిహికా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.