MM Keeravani: ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రపంచ సినీ ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు సొంతం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్ లోని నాటు నాటు పాటకు ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డు వరించింది. భారతీయ సినిమా ఇలా ఆస్కార్ అవార్డు దక్కించుకోవడంతో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఆర్ ఆర్ ఆర్ టీమ్ ని ప్రశంసిస్తున్నారు. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ ఆస్కార్ వేదికపై ట్రోఫీని అందుకోవడంతో భారతీయుల గుండె గర్వంతో ఉప్పొంగింది. అయితే ఇంతటి ప్రతిష్టాత్మకమైన పురస్కారాన్ని గెలుచుకున్న క్షణంలోనూ కీరవాణి తన ఎమోషన్స్‌ను బయటపడనీయలేదు.
కానీ ఒక వీడియో చూసిన తర్వాత ఆయన తనను తాను అదుపు చేసుకోలేకపోయారని రాజమౌళి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అసలు ఆ వీడియో ఏమిటి? కీరవాణి ఎందుకు ఎమోషనల్ అయ్యాడో పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఆస్కారు వేదికపై అవార్డ్ స్వీకరించిన తర్వాత కీరవాణి మాట్లాడుతూ..తాను ప్రముఖ అమెరికన్ మ్యూజిషియన్ రిచెర్డ్ కార్పెంటర్ సాంగ్స్ వింటూ పెరిగానన్నారు. ఇక ఈ సందర్భంగా కార్పెంటర్ బ్యాండ్‌కు సంబంధించిన ఐకానిక్ గీతం ‘ఆన్ టాప్ ఆఫ్ ది వరల్డ్’ను వినియోగించి రాజమౌళి తో పాటు త్రిబుల్ ఆర్ టీం కి పాట రూపంలో కృతజ్ఞతలు తెలియజేశాడు. అయితే ఇప్పుడు ఏకంగా రిచర్డ్ కార్పెంటర్ నుంచే కీరవాణి, చంద్రబోస్ స్పెషల్ వీడియో అందుకున్నారు. ఈ ఇద్దరు ఆస్కార్ విన్నర్స్‌ను అభినందించేందుకు కార్పెంటర్ తన కుటుంబంతో కలసి ‘టాప్ ఆఫ్ ది వరల్డ్’ రిజిగ్డ్ వెర్షన్ పాడారు.
MM Keeravani:
ఈ క్రమంలో కీరవాణి, చంద్రబోస్‌ను మెచ్చుకుంటూ కార్పెంటర్ పాడిన పాటపై దర్శకుడు రాజమౌళి స్పందించారు. ఈ వీడియో పై రాజమౌళి స్పందిస్తూ.. ‘సర్.. ఈ ఆస్కార్ క్యాంపెయిన్ అంతటా మా అన్నయ్య కీరవాణి చాలా ప్రశాంతంగా ఉన్నారు. పురస్కారం గెలవడానికి ముందు, ఆ తర్వాత కూడా ఆయన ఎప్పుడూ తన భావోద్వేగాలను ఎమోషన్స్ ని బయటపెట్టలేదు. కానీ మీ వీడియో చూసిన తర్వాత ఆయన తన కన్నీళ్లను ఆపుకోలేకపోయారు. ఇది మా కుటుంబానికి మరపురాని క్షణం.. ధన్యవాదాలు’ అంటూ కామెంట్ చేశాడు. ఇక కీరవాణి కూడా ఈ వీడియో పై స్పందిస్తూ… “ఇది అసలు ఊహించలేదు. ప్రపంచం నుండి ఇది ఒక మర్చిపోలేని బహుమతి ” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.