SS Rajamouli : ఎస్ఎస్ రాజమౌళి పేరు చెబితే చాలు.. ఇప్పుడు ప్రపంచ సినిమా మొత్తం ఆయన వైపే చూస్తుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆయన రేంజ్ ఏంటో అందరికీ తెలిసింది. ప్రపంచ సినిమా మొత్తం ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ వైపు చూస్తోందంటే దానికి కారణం ఆర్ఆర్ఆర్ మూవీ. ఈ సినిమాకు ఎంత క్రేజ్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆస్కార్ రేంజ్ కు ఎదిగింది ఈ సినిమా. ఒక ప్రాంతీయ సినిమా అది కూడా తెలుగు సినిమా ఆస్కార్ రేంజ్ కు వెళ్లడం అనేది ఇదే తొలిసారి. తెలుగు ప్రజలు అందరూ గర్వించదగ్గ విషయం. అయితే.. ఇదంతా కేవలం రాజమౌళి వల్లనే సాధ్యం అయింది.
అయితే.. ఇప్పుడు రాజమౌళి పెద్ద స్టార్ డైరెక్టర్. ఒక్క సినిమా తీస్తే కనీసం వంద కోట్లు తీసుకుంటారు. ఇప్పుడు ఆయన రిచ్ డైరెక్టర్. ఆయన ఈ స్టేజ్ కు రావడానికి చాలా కష్టపడ్డారు. ఒకప్పుడు ఆర్థికంగా చాలా బాధపడ్డారట. చేతిలో చిల్లిగవ్వ లేని టైమ్ ను కూడా ఆయన చూశారు. రాజమౌళి నాన్న స్టోరీ రైటర్ అయినా కూడా ఇంట్లో ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రమే ఉండేవట. తినడానికి తిండి కూడా లేని స్థాయి నుంచి రాజమౌళి ఎదిగారు అనేది చాలామందికి తెలియదు.
SS Rajamouli : విజయేంద్రప్రసాద్ రాసిన కథల సినిమాలు ఆడకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు
విజయేంద్రప్రసాద్ ఏదైనా సినిమాకు కథ రాస్తే.. డబ్బులు వస్తేనే వాళ్ల ఇల్లు గడిచేది. కొన్ని సార్లు ఆ సినిమాలు ఆడకపోతే ఇంటిల్లి పాది పస్తులు ఉండేవారట. మూడు పూటలు తిండి పెట్టడానికి కూడా విజయేంద్రప్రసాద్ చాలా కష్టపడేవారట. ఆ సమయంలో రాజమౌళి కూడా పస్తులతోనే ఉండేవారట. నిజానికి విజయేంద్రప్రసాద్ ది ఉమ్మడి ఫ్యామిలీ. దాదాపు 25 మంది కలిసి ఉండేవారు. ఇంట్లో ఉన్నవాళ్లంతా ఖాళీగా ఉన్న సమయంలో కేవలం ఎంఎం కీరవాణి మాత్రం చక్రవర్తి దగ్గర అసిస్టెంట్ గా చేరారు. అప్పట్లో చక్రవర్తి మ్యూజిక్ డైరెక్టర్ గా చాలా ఫేమస్. ఆయన దగ్గర అసిస్టెంట్ గా చేస్తూ వచ్చిన డబ్బులతో కుటుంబం మొత్తాన్ని కీరవాణే పోషించేవారు. అప్పుడు కీరవాణి భార్య ఇంటి బాధ్యత తీసుకొని అందరికీ వంట వండి పెట్టేవారట. రాజమౌళికి ఏదైనా డబ్బు కావాలన్నా కీరవాణే ఇచ్చేవారట. దాదాపుగా మూడేళ్లు కీరవాణే ఇంటికి పెద్ద దిక్కు అయి అందరినీ పోషించారట. అదే కృతజ్ఞత భావంతో రాజమౌళి ఇప్పుడు కీరవాణిని, ఆయన భార్యకు చాలా రెస్పెక్ట్ ఇస్తారు. రాజమౌళి తన ప్రతి సినిమాలో కీరవాణినే తీసుకుంటారు. ఎవ్వరికీ ఇవ్వని రెస్పెక్ట్ కీరవాణికి ఇస్తుంటారు.