Mohan Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. కొన్ని వందలకు పైగా సినిమాలలో నటించిన మోహన్ బాబు వారసులు కూడా సినిమా రంగంలో రాణించడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరికి సరైన గుర్తింపు రాకపోయినప్పటికీ తరచూ ఏదో ఒక విధంగా వార్తలో నిలుస్తూ వస్తున్నారు. ఇటీవల జరిగిన మంచు మనోజ్ మౌనిక రెడ్డి వివాహం వల్ల మంచి కుటుంబంలో గొడవలు తలెత్తినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ మౌనిక రెడ్డిని వివాహం చేసుకోవడం కుటుంబ సభ్యులకు ఇష్టం లేదని.. అందువల్లే మంచు విష్ణు, మనోజ్ మధ్య గొడవలు తలెత్తినట్లు సమాచారం.
ఇప్పటికీ ఈ కుటుంబానికి సంబంధించిన ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. తాజాగా మంచు కుటుంబం నుండి మరొక వార్త బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల మార్చి 19వ తేదీ మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు ఖరీదైన బహుమతి ఇచ్చినట్లు సమాచారం. మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా మంచు విష్ణు తన తండ్రి మోహన్ బాబుకి రేంజ్ రోవర్ ఆటోబయో కార్ల కలెక్షన్ లో గ్రఫీ కారుని గిఫ్ట్ గా ఇచ్చి సర్ప్రైజ్ చేసినట్లు తెలుస్తోంది.ఈ ఖరీదైన కారు ధర రూ. 5.25 కోట్లు అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Mohan Babu: నాన్నకు ప్రేమతో…
ఇదిలా ఉండగా ఎప్పటికప్పుడు అన్ని విషయాల గురించి సోషల్ మీడియా ద్వారా తండ్రికి పంచుకునే కుటుంబ సభ్యులు ఈ కారు విషయం గురించి బయట పెట్టలేదు. తండ్రి మీద ఉన్న ప్రేమతో విష్ణు మోహన్ బాబుకి ఐదు కోట్ల రూపాయల విలువ చేసి కారుని బహుమతిగా ఇచ్చాడు. మోహన్ బాబుకి ఉన్న కార్ల కలెక్షన్ లో అత్యంత ఖరీదైన కారు ఇదే. అయితే ఈ కారు ఫీచర్స్ స్పెసిఫికేషన్స్ గురించి మంచి కుటుంబం ఇప్పటివరకు బయట పెట్టలేదు. దీంతో ఈ కారు నిజంగానే విష్ణు తన బహుమతిగా ఇచ్చాడా లేదా అని గుసగుసలు వినిపిస్తున్నాయి.