Mohan Babu: తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు మోహన్ బాబు ఒకరు. ప్రస్తుతం ఈయన సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలలో నటిస్తూనే మరోవైపు మోహన్ బాబు యూనివర్సిటీ బాధ్యతలను కూడా ఎంతో విజయవంతంగా ముందుకు తీసుకు వెళ్తున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నటువంటి మోహన్ బాబు తాజాగా తన యూనివర్సిటీలో 77వ స్వాతంత్ర దినోత్సవపు వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఇలా తన యూనివర్సిటీలో జెండాను ఆవిష్కరించిన అనంతరం ఈయన కులాల గురించి మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
స్వాతంత్ర దినోత్సవం రోజు కుల వ్యవస్థపై మోహన్ బాబు మాట్లాడుతూ..అప్పట్లో ఈ కుల విభేదాలు ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరి మధ్య ఎంతో ఆప్యాయతలు ఉండేవి ప్రతి ఒక్కరు కూడా అత్త మామ పిన్ని బాబాయ్ అంటూ చాలా ఆప్యాయంగా పలకరించుకునేవారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు ఎక్కడ కనపడలేదు ప్రతి ఒక్కరూ కూడా కులం పేరుతో ఒకరినొకరు దూషించుకుంటున్నారని మోహన్ బాబు తెలిపారు. అయినా ఈ కులాలను ఎవరు కనిపెట్టారు. చిన్నప్పుడు నాతోటి స్నేహితుడిని ఒకరు అంటరాని వారు అనడంతో చెప్పుతో కొడతానన్నాను.

Mohan Babu: కుల పిచ్చి ఎక్కువ అయింది…
ఇప్పుడు కుల పిచ్చి మరీ ఎక్కువ అయిందని, ఇది నాశనానికి దారితీస్తుందని అందుకే తనకు కులాలు అంటే అసహ్యం అంటూ ఈ సందర్భంగా మోహన్ బాబు కుల వ్యవస్థ పై మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అయ్యాయి. ఇక ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని తన గ్రామస్తులతో మోహన్ బాబు తన యూనివర్సిటీలో 100 మొక్కలను నాటించారు. తన ఎదుగుదలకు ఎంతో సహకరించినటువంటి తన తల్లిదండ్రులు ఈ జన్మభూమి అలాగే తన గ్రామస్తులను తాను ఎప్పటికీ మర్చిపోనని ఈ సందర్భంగా మోహన్ బాబు కామెంట్స్ చేశారు.