Mohan Babu: భక్తవత్సలం నాయుడు అంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామందికి ఈ పేరు తెలియక పోయినప్పటికీ మోహన్ బాబు అంటే టక్కున గుర్తుపడతారు. భక్తవత్సలం నాయుడుగా ఉన్నటువంటి ఈయన ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబు గా మారిపోయారు. మోహన్ బాబు ఇండస్ట్రీలోకి రాకముందు డ్రిల్ మాస్టర్ గాపనిచేసేవారు.అనంతరం సినిమాలపై ఆసక్తితో ఈయన అసిస్టెంట్ డైరెక్టర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూనే చిన్న చిన్న వేషాలు వేస్తూ ఇండస్ట్రీలో బిజీగా ఉండేవారు.ఇకపోతే మోహన్ బాబు తన తండ్రి నారాయణస్వామి నాయుడుకి మొదటి కుమారుడు కావడంతో ముందు ఈయనకు పెళ్లి చేస్తేనే మిగతా ఇద్దరు తమ్ముళ్లు ఇద్దరు చెల్లెళ్లకు తాను పెళ్లి చేయవచ్చని మోహన్ బాబుకు పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
అయితే మోహన్ బాబు అప్పటికే ఇండస్ట్రీలో పనిచేయగా అతనికి కేవలం 200 రూపాయల జీతం మాత్రమే వచ్చేది.పెళ్లి చేసుకుంటే 200 రూపాయలతో తన కుటుంబాన్ని ఎలా పోషించాలి అంటూ ఈయన తరచూ పెళ్లి ప్రస్తావన వస్తే తోసిపుచ్చేవారు. ఎట్టకేలకు తండ్రి బలవంతం మీద పెళ్లికి ఒప్పుకున్న మోహన్ బాబు కు పెళ్లి సంబంధాలు రావడం మొదలయ్యాయి.అయితే తాను సినిమా ఇండస్ట్రీలో ఉన్నారని తెలియగానే వచ్చిన సంబంధాలు కాస్త వెనక్కి వెళ్ళిపోయేవారు.ఈ విధంగా ఈయనకు ఎన్ని రోజులకు పెళ్లి సెట్ కాకపోవడంతో తన తండ్రి నారాయణ స్వామి నాయుడు తన చిన్న కుమారుడికి మొదట పెళ్లి చేశారు.

Mohan Babu: మొదటి భార్య పేరుపై విద్యానికేతన్ సంస్థలు ప్రారంభించిన మోహన్ బాబు…
ఇకపోతే మోహన్ బాబు సొంత ఊరి సమీపంలోనే విద్యావతి అనే మహిళతో వివాహం సెట్ అయింది. ఈ క్రమంలోనే తనతో పెళ్లి జరిగిన అనంతరం మొదటి సంతానంగా లక్ష్మీ ప్రసన్న జన్మించారు. అనంతరం విష్ణు జన్మించారు. అయితే విధి వెక్కిరించడంతో విద్యావతి అకాల మరణం పొందారు. దీంతో పిల్లలు చిన్నతనంలో తల్లి ఆలనా పాలనకు లోనవడం, మోహన్ బాబును తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇకపోతే తల్లిదండ్రులు అత్తమామల సూచన ప్రకారం మోహన్ బాబు విద్యావతి సోదరి నిర్మలను రెండవ వివాహం చేసుకున్నారు. ఇకపోతే తన మొదటి భార్య పేరు మీదుగా మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలను ప్రారంభించారు. ఇక వీరి రెండవ పెళ్లికి డైరెక్టర్ దాసరి నారాయణరావు గారు పెద్దగా వ్యవహరించారు. అనంతరం నిర్మలను పెళ్లి చేసుకోవడంతో వీరిద్దరికీ మనోజ్ జన్మించారు.