Mohan Babu: సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకొని సక్సెస్ ఫుల్ గా ఇండస్ట్రీలో ముందుకు వెళ్లాలి అంటే అంత సులువైన పని కాదని చెప్పాలి. అవకాశాల కోసం తిరిగే సమయంలో ఎందరో ఎన్నో అవమానాలను పడుతూ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ప్రస్తుతం సక్సెస్ సాధించిన వారందరూ కూడా ఇలాంటి అవమానాలను ఎదుర్కొని ఇండస్ట్రీలో నిలబడి నేడు ఇండస్ట్రీలో ఎంతో చెరగని ముద్ర సంపాదించుకున్న వారే అని చెప్పాలి. ఈ విధంగా ఇండస్ట్రీలో నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి వారిలో సీనియర్ నటుడు మోహన్ బాబు ఒకరు.
ఈయన ఇండస్ట్రీలో విలక్షణ నటుడిగా, హీరోగా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఈ విధంగా ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి మోహన్ బాబు ఇండస్ట్రీలో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నారని చివరికి తన ఆశలు అన్నింటిని కూడా అమ్ముకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా తన సినీ కెరియర్ లో ఎదుర్కొన్నటువంటి కష్టాలను తెలియజేశారు. మోహన్ బాబు నేడు తన 71వ పుట్టినరోజు వేడుకలను జరుపుకొనున్నారు.
Mohan Babu: మగవాడికి కూడా కష్టాలు రాకూడదు…
ఇలా తన పుట్టినరోజు సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి మోహన్ బాబు తన సినీ కెరియర్ పూల పాన్పుల సాగలేదని ఎన్నో అవమానాలను ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపారు. నేను పైకి చూడటానికి ఇలా ఉన్న తాను కూడా ఎన్నో కష్టాలను అనుభవించానని తెలిపారు. ఒకానొక సమయంలో తాను తన ఇంటిని కూడా అమ్ముకోవాల్సి వచ్చిందని అయితే ఆ సమయంలో తనకు ఎవరూ కూడా సహాయం చేయలేదని తెలిపారు. ఇలా తన కష్టాల గురించి కొన్ని సార్లు ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదని ఈయన తెలియజేశారు. ఇలా మోహన్ బాబు తన కష్టాల గురించి మాట్లాడుతూ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.