Mohan Lal: ప్రముఖ మలయాళీ నటుడు మోహన్ లాల్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఈయన మలయాళీ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తెలుగు,తమిళ ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమైన వ్యక్తి. తెలుగు, తమిళ్ భాషలలో కీలక పాత్రలలో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తెలుగులో ఎన్టీఆర్ హీరోగా నటించిన జనతా గ్యారేజ్ సినిమా ద్వారా మోహన్ లాల్ కి మంచి గుర్తింపు లభించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మోహన్ లాల్ గురించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. మోహన్లాల్ అత్యంత ఖరీదైన కారుని కొనుగోలు చేసినట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి.
సాధారణంగా సెలబ్రిటీలు ఉపయోగించే వస్తువులు వాహనాలు అన్నీ కూడా చాలా ఖరీదైనవిగా ఉంటాయి. అయితే తాజాగా మోహన్ లాల్ కొనుగోలు చేసిన కారు ఖరీదు తెలిసి అందరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. బ్రిటన్ కి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ రేంజ్ రోవర్ కొత్త మోడల్ ఆటో బయోగ్రఫీని తాజాగా మోహన్లాల్ కొనుగోలు చేశాడు. ఈ కారు ఖరీదు దాదాపు రూ. 4 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది. మోహన్ లాల్ వద్ద ఇప్పటికీ ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. మూడు కోట్ల రూపాయల విలువ చేసే లంబోర్గిని, కోటి రూపాయలు విలువ చేసే వెల్ ఫైర్, 80 లక్షలు విలువ చేసే మెర్సిడెస్ బెంజ్ జీల్ 350, అలాగే దాదాపు రెండు కోట్ల రూపాయల విలువచేసే టయోటా ల్యాండ్ క్రుయిజర్ కూడా ఉన్నాయి.
Mohan Lal: అత్యంత ఖరీదైన కారును కొన్న హీరో….
అయితే మోహన్లాల్ వద్ద ఉన్న కార్లలో ఇటీవల కొనుగోలు చేసిన రేంజ్ రోవర్ కారు అత్యంత ఖరీదైనది. ఇలా కోట్ల రూపాయల విలువ చేసే కార్లతో పాటు మోహన్లాల్ కి వందల కోట్ల ఆస్తులు కూడా ఉన్నాయి. ఇక మోహన్ లాల్ సినిమాల విషయానికి వస్తే మలైకొట్టై వాలిజన్ అనే సినిమా షూటింగ్ కి సంబంధించిన షెడ్యూల్ రాజస్థాన్ లో పూర్తి అయింది. అలాగే రజనీకాంత్ హీరోగా నటిస్తున్న జైలర్ సినిమాలో కూడా మోహన్లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం మోహన్ లాల్ కొత్త కారుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.