Mokshagna: నందమూరి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వనున్నట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. గత కొంత కాలంగా బాలకృష్ణ తన కొడుకుడినీ ఇండస్ట్రీకి పరిచయం చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం మనకు తెలిసినదే. బాలకృష్ణ 100వ సినిమా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ద్వారా తన కుమారుడు మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నాడు అని అప్పట్లో వార్తలు వినిపించాయి. కానీ ఆ వార్తల్లో ఎటువంటి నిజం లేదు. కాకపోతే మోక్షజ్ఞ తప్పకుండా హీరోగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడు అంటూ బాలకృష్ణ ఇప్పటికే ప్రకటించాడు. అందువల్ల ప్రస్తుతం తన కొడుకుని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు.
బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా సూపర్ హిట్టయిన సంగతి అందరికి తెలిసిన విషయమే. ఆ సినిమా సీక్వెల్ ద్వారా మోక్షజ్ఞని ఇండస్ట్రీకి పరిచయం చేయాలనుకున్నారు. కానీ ఆ ప్రయత్నం విఫలమయింది. ఇక బాలకృష్ణ కెరీర్లో హ్యాట్రిక్ హిట్స్ అందించిన మాస్ డైరెక్టర్ బోయపాటి శీను మోక్షజ్ఞ ని హీరోగా పరిచయం చేయనున్నాడు అంటూ అభిమానులు సంబరపడ్డారు. కానీ ఆ ఆశ కూడా నెరవేరలేదు. దానికి తోడు ఆ సమయంలో మోక్షజ్ఞ బాడీ కూడా షేప్ అవుట్ అయ్యింది.

Mokshagna: అనిల్ రావిపూడి దర్శకత్వం లో…
ఇక ప్రస్తుతం ఇండస్ట్రీలో మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం మోక్షజ్ఞ కొంచం సన్నబడటంతో తనని హీరో గా లాంచ్ చేయటానికి ఇదే మంచి సమయం అని భావించిన బాలకృష్ణ.. ఫ్యామిలీ డైరెక్టర్ అనీల్ రావిపూడికి తన కొడుకుని హీరోగా లాంచ్ చేసే భాధ్యత అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ప్రస్తుతం మోక్షజ్ఞ ఫోటోలు సోషియల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలు చూసిన కొందరు నెటిజన్లు ఈ బాడీతో ఎలా హీరో అవుతాడు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి మోక్షజ్ఞ తన బాడీని మరింత ఫిట్ గా తయారు చేసుకోవాలని అభిమానులు ఆశ పడుతున్నారు. ఇకపోతే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుంది అనే వార్తల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.