Mokshagna: టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న పేరు ప్రఖ్యాతల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఎంతోమంది నందమూరి హీరోలు ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా రాణిస్తున్నారు. ఈ క్రమంలో నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ కూడా హీరోగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వాలని నందమూరి అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. మరొకవైపు బాలకృష్ణ కూడా తన వారసుడిని హీరోగా అభిమానులకు పరిచయం చేయాలని ఎంతో ఆరాటపడుతున్నాడు. దీంతో గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ గురించి అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు మోక్షజ్ఞ మొదటి సినిమా గురించి ఎటువంటి అప్డేట్ లేదు.
ఇటీవల అమెరికాలో జరిగిన తానా సభలో పాల్గొన్న బాలకృష్ణ.. తన కొడుకు మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై మరోసారి ఓపెన్ అయ్యారు. తన కొడుకుని వచ్చే సంవత్సరం టాలీవుడ్ కి పరిచయం చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అయితే మోక్షజ్ఞని హీరోగా ఇండస్ట్రీకి పరిచయం చేసే డైరెక్టర్ గురించి , స్టోరీ గురించి మాత్రం ఇప్పటివరకు ఏ విషయం బయటికి రాలేదు. అయితే ఇండస్ట్రీలో మోక్షజ్ఞ ఎంట్రీ తప్పకుండా ఉంటుందని బాలయ్య చెప్పిన మాటతో నందమూరి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా నందమూరి అభిమానులు ఆనందపడే మరొక వార్త బయటకు వచ్చింది.

Mokshagna: మోక్షజ్ఞ సినిమాలో బాలయ్య మనవడు…
మోక్షజ్ఞ ఎంట్రీ కోసం యూత్ అండ్ పవర్ ఫుల్ స్టోరీని లాక్ చేరని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమాలో మోక్షజ్ఞ చిన్ననాటి పాత్ర కోసం బాలయ్య తన మనవడిని మొదటిసారిగా ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు ప్రస్తుతం ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకాలం మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు నందమూరి కుటుంబం నుండి మరొక వారసుడు చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నాడు అన్న విషయం తెలిసి సంబరాలు జరుపుకుంటున్నారు. ఈ విషయం తెలియడంతో నందమూరి అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయింది.