Mrunal Thakur: మృణాల్ ఠాకూర్ పరిచయం అవసరం లేని పేరు.నటిక ఇండస్ట్రీలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె తెలుగులో కూడా సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే తెలుగులో కూడా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె ప్రస్తుతం తెలుగులో వరుస సినిమా అవకాశాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ప్రస్తుతం ఈమె నాని విజయ్ దేవరకొండ సినిమాలలో మాత్రమే కాకుండా మరో రెండు సినిమాలకు కూడా కమిట్ అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం నాని హీరోగా నటిస్తున్న సినిమాలో ఈమె నటిస్తున్నారు.
ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో ఈమె హీరో నానితో ప్రేమలో పడ్డారు అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో సంచలనంగా మారింది.షూటింగ్ సమయంలో అందరితోనూ నాని వ్యవహరించే తీరు అందరి పట్ల ఆయన తీసుకునే జాగ్రత్తలు చూసి ఈమె ఆయన ప్రేమలో పడిపోయారట. పెళ్లి చేసుకుంటే తనకి కూడా ఇలాంటి భర్త రావాలని ఈమె ఆశపడ్డారని తెలుస్తుంది. ఈ విధంగా మృణాల్ నాని మంచితనం ఆయన వ్యక్తిత్వం పట్ల ఆయన ఇతరుల పట్ల చూపించే ప్రేమ జాగ్రత్తలు చూసి ఈమె కూడా ప్రేమలో పడ్డారని తెలుస్తోంది.
Mrunal
: నాని ప్రేమలో మృణాల్….
ఇలా నాని మంచితనం తన వ్యక్తిత్వం చూసి ఇలాంటి వ్యక్తి భర్తగా రావాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ నానినే తన భర్త కావాలి అంటేనే కష్టం అంటూ పలువురు ఈమె వ్యవహారంపై కామెంట్లు చేస్తున్నారు. ఇలా తనకు నానియే భర్తగా రావాలని కోరుకుంటే మాత్రం నాని భార్య అంజన పరిస్థితి ఏంటి పాపం అంటూ కొందరు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈమె చేసిన ఈ వ్యాఖ్యలపై పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఇక నాని కూడా ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. దసరా సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి నాని త్వరలోనే హాయ్ నాన్న సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.