Mrunal Thakur: మృణాల్ ఠాకూర్… ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకే ఒక్క సినిమాతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. హిందీ సీరియల్స్ లో నటిస్తూ తన కెరీర్ ప్రారంభించిన మూడు నాలుగు సినిమాలలో నటించే అవకాశాలు అందుకుంది. ఈ క్రమంలో షాహిద్ కపూర్ హీరోగా నటించిన జెర్సీ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి హిట్ అందుకుంది. ఆ తర్వాత తెలుగులో సీతారామం సినిమాలో సీతా మహాలక్ష్మి పాత్రలో నటించి తన అందం అభినయంతో తెలుగు ప్రజల మనసుల్ని దోచుకుంది. ఈ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటంతో ఓవర్ నైట్ లో హీరోయిన్ గా పాపులర్ అయింది. దీంతో అమ్మడు టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటించే అవకాశాలు అందుకుంటుంది.
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మృనాల్ ఠాకూర్ తన సినీ జీవితం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది. సినిమాలలో నటించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని వెల్లడించింది. మరాఠీ కుటుంబానికి చెందిన తాను సినిమాలలో నటించడం తన తల్లిదండ్రులకు ఇష్టం లేదని, అయితే వారి ఇష్టాన్ని కాదని తాను హీరోయిన్గా సినిమాలలో రాణిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. తన తల్లిదండ్రులు ఇలా సినిమా రంగంలోకి అడుగుపెట్టడానికి నిరాకరించడానికి కారణం సినిమా ఇండస్ట్రీ గురించి వారికి పూర్తిగా తెలియకపోవటమేనని వెల్లడించింది.
Mrunal Thakur: గర్వంగా ఉంది..
సినిమా ఇండస్ట్రీలో ఆడపిల్లలు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అందువల్లే వారికి నన్ను హీరోయిన్ గా సినిమా ఇండస్ట్రీలోకి పంపించడానికి ఇష్టపడలేదని తెలిపింది. మొదట నేను హీరోయిన్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టినా కూడా వారు సపోర్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో నాకు మంచి గుర్తింపు వచ్చింది. చాలా మంది నన్ను స్మితా పాటిల్ తో పోల్చుతున్నారు. అలా ఆమెతో పోల్చటం నాకు చాలా గర్వంగా ఉంది. ఇక నా పేరెంట్స్ కూడా ఇప్పుడు నా పట్ల చాలా సంతోషంగా ఉన్నారు” అని చెప్పుకొచ్చింది మృణాల్.