Mrunal Thakur: ఇండస్ట్రీలోకి మోడల్ గా అడుగుపెట్టి అనంతరం పలు హిందీ సీరియల్స్ లో నటిస్తూ వెండితెర అవకాశాలను అందుకున్నటువంటి వారిలో నటి మృణాల్ ఠాకూర్ ఒకరు.ఇలా పలు బాలీవుడ్ సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి ఈమె తెలుగులోకి సీతారామం సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా ఈ సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె తెలుగులో కూడా ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నారు. చీర కట్టులో అచ్చమైన తెలుగు అమ్మాయిల సీతా మహాలక్ష్మి పాత్రలో ఎంతో అద్భుతంగా నటించి మెప్పించారు.
ఇలా మొదటి సినిమాతో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమెకు ప్రస్తుతం తెలుగులో వరుస అవకాశాలు వస్తున్నాయి. త్వరలోనే నాచురల్ స్టార్ నానితో కలిసి ఈమె తన సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.అయితే ప్రస్తుతం ఈమె హాలిడే వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తన వెకేషన్ కి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ సందడి చేస్తున్నారు. అయితే తాజాగా నటి మృణాల్ బికినీ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.
Mrunal Thakur: ఇది అసలు ఊహించలేదు…
సముద్రపు ఒడ్డున బ్లూ కలర్ బికినీ ధరించి ఈమె అందాల ఆరబోతతో పెద్ద ఎత్తున రచ్చ చేశారు. ఇలా ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయని చెప్పాలి.ఈ ఫోటోలు చూసినటువంటి నేటిజన్స్ ఈమె అందం గురించి పొగుడుతూ కామెంట్లు చేయగా మరి కొందరు మాత్రం ఇందుకు విరుద్ధంగా కామెంట్లు చేస్తున్నారు.మీ నుంచి ఇది అసలు ఊహించలేదు అంటూ కొందరు స్పందించగా మరికొందరు మాత్రం మీరు బికినీలో కన్నా చీరలోనే చాలా అందంగా కనిపించారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరొక నెటిజన్ అయితే ఏకంగా RIP సీతామహాలక్ష్మి అంటూ ఈమెకు దిమ్మతిరిగే రేంజ్ లో కామెంట్ చేశారు.ప్రస్తుతం ఈ నెటిజన్ చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.