Mukku Avinash: కామెడీ షో జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా పేరు సంపాదించుకున్నాడు ముక్కు అవినాష్. తన కామెడీతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అతి తక్కువ సమయంలో తనకంటూ ఒక గుర్తింపు సొంతం చేసుకున్నాడు. జబర్దస్త్ కు ముందు అవినాష్ మిమిక్రీ ఆర్టిస్ట్ గా పనిచేసాడు. ఆ తర్వాత జబర్దస్త్ లో అడుగు పెట్టి సెలబ్రేటి హోదాను సొంతం చేసుకొని విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నాడు.
ఇక వెండితెరపై పలు సినిమాలలో నటించాడు. ఈయన రియాలిటీ షో బిగ్ బాస్ లో అడుగుపెట్టి మరింత గుర్తింపు సొంతం చేసుకున్నాడు. బిగ్ బాస్ తర్వాత జబర్దస్త్ కు దూరమైన అవినాష్ పలు షోలలో మాత్రం పాల్గొని బాగా సందడి చేస్తున్నాడు. సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తాడు అవినాష్. ఆ మధ్యనే ఈయన పెళ్లి చేసుకోగా తన భార్యతో కలిసి వీడియోలు చేస్తూ ఉంటాడు. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఈయనను భాను అందరి ముందు గట్టిగా కొట్టింది.
ఇంతకు అసలు ఏం జరిగిందంటే.. ప్రస్తుతం స్టార్ మా లో బిబి డాన్స్ జోడి ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఇదివరకు బిగ్ బాస్ సీజన్లలో పాల్గొన్న కంటెస్టెంట్ లందరూ జంటలుగా మారి డాన్సులు చేస్తున్నారు. ఇక ముక్కు అవినాష్ కు జంటగా అరియానా ఉండగా.. భాను రవికృష్ణ కు జోడిగా ఉంది. అయితే తాజాగా వచ్చే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదలైంది.
Mukku Avinash: అందరి ముందు అవినాష్ ను ఛీ కొట్టిన భాను..
అందులో భాను, రవి ఇద్దరు కలిసి నీకు నాకు నోకియా అనే పాటకు పర్ఫామెన్స్ చేశారు. దీంతో అది చూసి జడ్జిగా ఉన్న సదా ఫిదా అయింది. ఇక ఆమె వెంటనే రవి కృష్ణ తో కలిసి స్టెప్ వేసింది. ఆ తర్వాత అవినాష్, భాను కలిసి స్టెప్ వేయగా అందులో అవినాష్ కు స్టెప్ రాక పోయేసరికి తనకు నచ్చినట్లుగా చేయడంతో వెంటనే భాను అతడి చెంపపై కొట్టింది. తర్వాత తూ అని చీకొట్టింది. దీంతో వారిద్దరి మధ్య జరిగిన సంఘటనను చూసి అక్కడున్న వాళ్లంతా తెగ నవ్వుకున్నారు.