Murali Mohan: అక్కినేని నాగచైతన్య సమంత ఈ జంట గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న ఈ జంట నాలుగు సంవత్సరాలు పాటు వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్నారు. ఇకపోతే గత ఏడాది వీరిద్దరూ విడాకుల గురించి ప్రకటించారు.వీరి విడాకుల ప్రకటన వచ్చి దాదాపు సంవత్సరం కావస్తున్న ఇప్పటికీ వీరి విడాకుల గురించి ఏదో ఒక విషయం వార్తల్లో ఉంటుంది. అయితే వీరి విడాకుల గురించి ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ సరైన కారణం మాత్రం తెలియడం లేదు. ఇకపోతే తాజాగా సమంత నాగచైతన్య విడాకుల గురించి సీనియర్ నటుడు నిర్మాత మురళీమోహన్ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మురళీమోహన్ మాట్లాడుతూ నాగచైతన్యకు నా అపార్ట్మెంట్ నచ్చడంతో ఆయన ఆ అపార్ట్మెంట్ తనకు కావాలని అడిగారు. అయితే అది నా ఫ్యామిలీ కోసం నిర్మించుకున్నది కావడంతో ఇవ్వలేకపోయాను.ఇక ఈ విషయాన్ని నాగ చైతన్య నాగార్జున దగ్గర చెప్పడంతో స్వయంగా నాగార్జున తనకి ఫోన్ చేసి తన అపార్ట్మెంట్ నాగచైతన్యకు నచ్చిందని తప్పకుండా నాగచైతన్యకు ఇవ్వాలని అడిగారు. ఎప్పటినుంచో నాగార్జునతో మంచి సాన్నిహిత్యం ఉండటం వల్ల నాగార్జున అడిగేసరికి కాదనలేకపోయాను.ఇలా మా పెద్దబ్బాయికి నిర్మించిన అపార్ట్మెంట్ నాగచైతన్యకు ఇచ్చానని మురళీమోహన్ తెలిపారు.
Murali Mohan: నాగచైతన్య సమంత ఎంతో అన్యోన్యంగా ఉండే వారు…
ఇకపోతే నాగచైతన్య సమంత ఇద్దరూ అదే అపార్ట్మెంట్లో ఉండేవారు ఎప్పుడు చూసిన వీరిద్దరూ ఎంతో సంతోషంగా అన్యోన్యంగా కనిపించేవారు.ఇద్దరు కలిసి తరుచూ పార్టీలు చేసుకోవడం సంతోషంగా ఉండడం వరకు మాత్రమే తనకు తెలుసు అని ఎప్పుడూ కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగిన విషయం కూడా తాను వినలేదని మురళీమోహన్ తెలిపారు. అయితే ఒక రోజు తన పనిమనిషి వచ్చి సమంత నాగచైతన్య విడాకులు తీసుకోబోతున్నారట అని చెప్పే వరకు తనకు విడాకుల విషయం తెలియదని ఈ విషయం తెలిసేసరికి చైతన్య సమంతతో కాకుండా వేరే హోటల్లో ఉన్నారని మురళీమోహన్ తెలిపారు.ఇలా వీరిద్దరూ విడాకులు తీసుకున్నారనే విషయమే తెలుసు కానీ ఎందుకు తీసుకున్నారు అనే విషయం మాత్రం తెలియదని మురళీమోహన్ ఈ ఇంటర్వ్యూ సందర్భంగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.