Nabha Natesh: నన్ను దోచుకుందువటే అనే సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హీరోయిన్ నభా నటాషా. ఈ సినిమా కమర్షియల్ గా హిట్ కాకపోవడంతో ఈ అమ్మడికి తగిన గుర్తింపు లభించలేదు. ఈమె కన్నడ , తెలుగు భాషలలో పలు చిత్రాలలో నటించింది. తెలుగులో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాలో రామ్ కి జోడిగా నటించిన ఈ అమ్మడు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు పొందింది. ఆ సినిమా మంచి హిట్ అవటంతో ఈ అమ్మడికి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి.
సోలోబ్రతుకే సో బెటర్, డిస్కో రాజ, అల్లుడు అదుర్స్ వంటి సినిమాలు ప్లాప్ అవ్వటంతో అప్పటినుండి సినిమా అవకాశాలు తగ్గాయి. అయినప్పటికీ సోషియల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఈ అమ్మడు తన హాట్ ఫోటోలతో ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ప్రస్తుతం సినిమా అవకాశాలు తగ్గడంతో ఎలాగైనా అవకాశాలు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో సోషల్ మీడియాలో మరింత రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ ఉంది. ఈ క్రమంలో తరచు హాట్ ఫోటోలకు ఫోజులిస్తు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అవుతోంది.

Nabha Natesh: అవకాశాలకు అందాన్ని ఎరగా వేసిన బ్యూటీ..
ఇటీవల సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసిన ఒక ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఫోటోలో నభా నటాషా జీన్స్ ప్యాంట్ ధరించి నడుము అందాలు కనిపించేలా ఇన్నర్ టాప్ మాత్రమే ధరించి ఫోటోకి ఫోజులిచ్చింది. ఈ ఫోటోలో ఈ అమ్మడి అందం చూసిన నెటిజన్లు కళ్ళు తిప్పుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇటీవల ఏదో ఒకటి రెండు ప్రాజెక్టుల పై చర్చలు సాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ.. కొత్త ప్రాజెక్ట్ గురించి అఫీషియల్ గా ఎలాంటి క్లారిటీ లేదు. ఈ బ్యూటీ చేసే గ్లామర్ రచ్చతో ఏవైనా కొత్త అవకాశాలు అందుకుంటుందో.. లేదో.. చూడాలి మరి.