Nabha Natesh: టాలీవుడ్ ఇండస్ట్రీ కి చెందిన గ్లామర్ బ్యూటీ నభా నటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందంతో ఎంతోమంది మనసులను దోచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో కూడా మంచి గుర్తింపును దక్కించుకుంది. కానీ టాలీవుడ్ ఇండస్ట్రీలో అంతగా కొనసాగ లేక పోతుంది. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఈ బ్యూటీ కన్నడ సినిమాతో సినీ పరిశ్రమకు తొలిసారిగా పరిచయమైంది.
ఇక నన్ను దోచుకుందువటే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. తర్వాత పలు సినిమాలలో అవకాశాలు ఇస్మార్ట్ శంకర్ సినిమాలో చాందిని పాత్రతో మంచి మార్కులు సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత ఏ సినిమాలలో నటించిన కూడా మళ్లీ అంతగా సక్సెస్ కాలేకపోయింది. ఇక ప్రస్తుతం అంతగా అవకాశాలు కూడా అందుకోన్నట్లు తెలుస్తుంది. ఇక అవకాశాల కోసం సోషల్ మీడియా వేదికను ఎంచుకొని అందులో బాగా గ్లామర్ షో చేస్తూ కనిపిస్తుంది.
సినిమాలకు దూరంగా ఉన్నా కూడా ఏదో ఒక విధంగా సోషల్ మీడియాతో అందరికీ దగ్గరలో ఉంది. సోషల్ మీడియాలో ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. నిత్యం ఏదో ఒక ఇంట్రెస్టింగ్ పోస్టుతో పాటు తన ఫోటోలను కూడా పంచుకుంటుంది. అయితే ఇదంతా పక్కన పెడితే తాజాగా ఒక విషయాన్ని బయట పెట్టింది ఈ బ్యూటీ. తాజాగా తన ఇన్ స్టాలో.. నేను అందరినీ బాగా మిస్ అయ్యానని అయితే గత ఏడాదిలో తనకు ఒక యాక్సిడెంట్ అయ్యింది అని తెలిపింది.
Nabha Natesh:
ఆ సమయంలో తన ఎడమ చేతి భుజం దగ్గర ఫ్రాక్చర్ కూడా అయ్యిందని.. మరిన్ని ఎముకలు కూడా విరిగాయని.. దీనివల్ల చాలా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది అని తెలిపింది. ఇక దీనివల్లనే సినిమాలకు కూడా వచ్చింది అంటూ.. ఇప్పుడు కోల్పోవడంతో ఈ ఆనందకర విషయాన్ని అందరితో పంచుకుంటున్నాను అని.. ఇన్నాళ్లు తనపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు అని తెలిపింది. ప్రస్తుతం ఆమె పంచుకున్న పోస్ట్ వైరల్ అవుతుంది.