Nabha Natesh: స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సిల్వర్ స్క్రీన్‌కు పరిచయం చేశాడంటే హిట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మంచి క్రేజ్ మాత్రం తెచ్చిపెడతారు. హీరోయిన్‌ను ఎలా చూపిస్తే ఆడియన్స్ కొన్నేళ్ళపాటు మర్చిపోరో పూరికి తెలిసినంతగా మరో దర్శకుడికి తిలియదని చెప్పొచ్చు. అందుకే, అన్నీ కోణాలలోనూ పూరీ హీరోయిన్ బాగా పాపులర్ అవుతుంది. గత కొంతకాలంగా పూరి సక్సెస్ లేక ఇబ్బందులు పడ్డ సంగతి తెలిసిందే. ఎట్టకేలకు ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ మాస్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్స్‌గా నటించిన నిధీ అగర్వాల్, నభా నటేష్‌లకు వచ్చిన క్రేజ్ ఏంటో అందరికీ తెలిసిందే.
అయితే, ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎక్కువగా అవకాశాకు దక్కించుకుంది నభా నటేశ్. నిధికి మాత్రం పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, నిధికి తెలిసిన లాజిక్ నభా మిస్ అయింది. వరుసగా అవకాశాలు దక్కడంతో అవి హిట్ అవుతున్నాయా, ఫ్లాపవుతున్నాయా ఆలోచించకుండా తన కెరీర్ అసలు ఎటు వెళుతుందో పట్టించుకోకుండా కొత్త సినిమా అని మేకర్స్ ఎవరైనా వస్తే భారీగా రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. క్రేజ్ ఉంది కదా అని అలా డిమాండ్ చేస్తే మన మేకర్స్ అంత ఈజీగా ఛాన్స్ ఇచ్చేవాళ్ళు కాదు కదా.
Nabha Natesh: పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు..!
వరుస సక్సెస్‌లలో ఉన్న హీరోయిన్ ఎంత డిమాండ్ చేసినా ఇచ్చేస్తారు. కానీ, వరుస ఫ్లాపులొస్తున్న హీరోయిన్ అంటే చాలా ఆలోచిస్తారు. అందుకే నభా రెమ్యునరేషన్ విషయంలో మేకర్స్ షాకయి లైట్ తీసుకున్నారట. నిధి మాత్రం నెమ్మదిగా పుంజుకున్నా.. తమిళంలో రెండు సినిమాలు చేసి హిట్ అందుకుంది. తెలుగులో ఏకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన హరిహర వీరమల్లు అనే పాన్ ఇండియా సినిమాను చేస్తుంది. సినిమా భారీ బడ్జెట్ అయినా తాను మాత్రం రెమ్యునరేషన్ విషయంలో డిమాండ్ చేయదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్.