Naga Chaitanya: టాలీవుడ్ ప్రేక్షకులకు అక్కినేని నాగచైతన్య గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. జోష్ సినిమా ద్వారా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన చైతూ ఆ తర్వాత వచ్చిన ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టు కున్నాడు. ఆ సినిమాలో సమంత నాగచైతన్యల లవ్ స్టోరీ బాగా పండింది.
ఇక ఇటీవల వచ్చిన బంగార్రాజు సినిమా లో ప్రేక్షకులను మరో స్థాయిలో ఆకట్టుకున్నాడు నాగ చైతన్య. మొత్తానికి చైతూ టాలీవుడ్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా థాంక్యూ సినిమా టీజర్ విడుదల అయింది. నాగచైతన్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా కు.. కె విక్రమ్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా రాశి ఖన్నా మాళవిక నాయర్ లు హీరోయిన్ లు గా మెప్పించ బోతున్నారు.

Naga Chaitanya: నాగ చైతన్య జీవితంలో కాంప్రమైజ్ అయ్యే ఆలోచన నాకు లేదు అని ఈ నేపథ్యంలో చెబుతాడు!
ఇక అన్నీ వదులుకొని ఎక్కడ దాక వచ్చాను.. ఇక లైఫ్ లో కాంప్రమైజ్ అయ్యేదే లేదు. నన్ను నేను సరి చేసుకోవడానికి నేను చేస్తున్న ప్రయాణమే అని నాగచైతన్య చెప్పే డైలాగ్ తో ఈ సినిమా టీజర్ విడుదల అయ్యింది. ఇక ఈ టీజర్ ను బుధవారం నాడు విడుదల చేసారు. ఈ సినిమాలో బిజినెస్ మ్యాన్ అభిరామ్ పాత్రలలో నాగచైతన్య నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఒక సక్సెస్ ఫుల్ పర్సన్ జీవితం లో గుడ్ ఫీల్ లవ్ స్టోరీ ను ఈ సినిమాలో చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రాశి ఖన్నా నాగ చైతన్య ల కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు కొత్త టేస్ట్ చేయాలని సినిమా విషయంలో మరింత ఆసక్తికరంగా ఉన్నారు. ఇక బంగార్రాజు సినిమా హిట్ ను తన సొంతం చేసుకున్న నాగ చైతన్య ఈ సినిమాతో ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.