Naga Chaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలో లవ్లీ కపుల్స్ గా పేరు సంపాదించుకున్న వారిలో సమంత నాగ చైతన్య జంట ఒకటి. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా ఉన్న ఈ జంట నాలుగు సంవత్సరాల పాటు వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ అనంతరం పలు మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకోవడంతో ఎవరికి వారు వారి జీవితంలో బిజీ అయ్యారు. ఇలా సమంత నాగచైతన్య ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సమంత నటించిన శాకుంతలం, యశోద సినిమాలు విడుదలకు సిద్ధం కాగా నాగచైతన్య నటించిన థ్యాంక్యూ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
ప్రస్తుతం సమంత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో, శివ నిర్వాణ దర్శకత్వంలో, విజయ్ దేవరకొండతో కలిసి ఖుషి సినిమాలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ కాశ్మీర్ లో జరుపుకుంది. తాజాగా మొదటి షెడ్యూల్ చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఒక స్టంట్ సీక్వెన్స్ చిత్రీకరణలో భాగంగా విజయ్ దేవరకొండ సమంత ప్రమాదానికి గురైనట్లు వార్తలు వచ్చాయి. ఇలా వీరిద్దరి వెహికల్ నదిలోకి పడిపోవటం వల్ల వీరికి గాయాలయ్యాయని వార్తలు చక్కర్లు కొట్టాయి.

Naga Chaitanya: పుకార్లు మాత్రమే…
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నాగచైతన్య అభిమానులు రెచ్చిపోయి సమంత పై ట్రోల్స్ చేస్తున్నారు.సమంతకు నాగ చైతన్య ఉసురు తగిలింది. అందుకే యాక్సిడెంట్ అయింది అంటూ పెద్ద ఎత్తున కామెంట్లు చేశారు.ఈ విధంగా నాగచైతన్య అభిమానులు సమంత గురించి కామెంట్లు చేయడంతో సమంత అభిమానులు కొంతవరకు ఆందోళన చెందిన తర్వాత ఊపిరిపీల్చుకున్నారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎలాంటి ప్రమాదం జరగలేదని ఇవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని చిత్రబృందం ఈ వార్తలపై స్పందించిన అధికారికంగా వెల్లడించారు. దీంతో ఒక్కసారిగా సమంత విజయ్ దేవరకొండ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.