Naga chaitanya: చైతూకు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదా.. అందుకే విడాకులు ఇచ్చాడా.. ఇదే ప్రూఫ్!

Akashavani

Naga chaitanya: యువ సామ్రాట్ నాగార్జున తనయుడు అక్కినేని నాగ చైతన్య ” ఏం మాయ చేసావే ” సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ సినిమాలో నాగచైతన్యకు జోడీగా సమంత నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో సమంత, నాగ చైతన్య ఇద్దరు వరుస సినిమాలతో బిజీ అయిపోయారు. ఆ సినిమా షూటింగ్ సమయంలో వారిద్దరి మధ్య చిగురించిన ప్రేమ పెళ్లి దాకా వెళ్ళింది. వీరిద్దరూ పెళ్లి చేసుకొని కొంత కాలం సంతోషంగా ఉన్నారు.

కానీ కొంతకాలం క్రితం వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా ఇద్దరు విడాకులు తీసుకున్నారు. దీంతో వీరి అభిమానులు ఎంతో నిరాశ చెందారు. వీరిద్దరూ కలవాలని ఇప్పటికీ వారి అభిమానులు కోరుకుంటున్నారు. విడాకులు తీసుకున్న తర్వాత ఇద్దరు సినిమాలతో బాగా బిజీ అయిపోయారు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలు హిట్ అవటంతో నాగచైతన్య మంచి ఫామ్ లో ఉన్నాడు. ప్రస్తుతం నాగచైతన్య నటించిన థాంక్యు సినిమా షూటింగ్ పనులు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా రాశికన్నా నటించింది. ఈ సినిమా కి విక్రమ్‌ కే కుమార్‌ దర్శకత్వం వహించాడు.

Naga chaitanya: చైతూకు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదా.. అందుకే విడాకులు ఇచ్చాడా.. ఇదే ప్రూఫ్!
Naga chaitanya: చైతూకు అమ్మాయిలంటే ఇంట్రెస్ట్ లేదా.. అందుకే విడాకులు ఇచ్చాడా.. ఇదే ప్రూఫ్!

Naga chaitanya: ఫోన్ లో లీనమైపోయిన చైతూ…

శ్రీ వెంక‌టేశ్వ‌రా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు, శిరీష్‌లు కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో నాగచైతన్య హాకీ ప్లేయర్ గా ప్రేక్షకులను అలరించనున్నాడు. ఈ సినిమాలో మాళవిక నాయర్, అవికాగోర్ వంటి వారు ప్రధాన పాత్రలలో కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా బీటీఎస్‌ నుండి ఒక ఫోటో సోషల్ మీడియా ద్వారా విడుదల చేశారు. ఈ ఫొటోలో రాశీ ఖన్నా చైర్ లో కూర్చుని దర్శక నిర్మాతలతో మాట్లాడుతుండగా.. నాగ చైతన్య మాత్రం ఏమి పట్టనట్టు తన మొబైల్ ఫోన్ చూస్తున్నాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. నాగచైతన్య ఇలా చేయటంతో ఎంతో మంది నెటిజన్లు ఈ ఫోటో పై స్పందిస్తూ నాగచైతన్యకి అమ్మాయిలంటే ఆసక్తి లేకపోవటం వల్ల సమంతకి విడాకులు ఇచ్చారని పెద్ద ఎత్తున నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -