Naga shourya- Jr NTR: హీరో నాగ శౌర్య, ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి.. ఇద్దరు బంధువుల?

Akashavani

Naga shourya- Jr NTR: టీ టౌన్ ప్రేక్షకులకు హీరో నాగ సౌర్య గురించి ప్రత్యేకించి పరిచయం అక్కర్లేదు. ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా టాలీవుడ్ అడుగు పెట్టి మంచి ఫేమ్ సంపాదించుకున్నాడు. ఇక ఆ పై పలు సినిమాల్లో నటించిన నాగ శౌర్య తెలుగు ప్రేక్షకులకు హీరోగా తన యాక్టింగ్ లెవెల్స్ కనబరిచాడు.

మొత్తానికి నాగ శౌర్య ఇండస్ట్రీలో హీరోగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇటీవల వచ్చిన లక్ష్య సినిమాలో నాగ శౌర్య లుక్ ప్రేక్షకులను మరో లెవెల్లో ఆకట్టు కుంది. ఇదంతా పక్కన పెడితే అప్పట్లో నాగ శౌర్యకు జూనియర్ ఎన్టీఆర్ కి దగ్గరి బంధుత్వం ఉందని పుకార్లు షికార్లు కొట్టాయి. ఇక ఈ పుకార్లకు తగ్గట్టే నాగశౌర్య పలు ఇంటర్వ్యూ లలో నందమూరి ఫ్యామిలీ గురించి పొగిడే వాడు.

ఇక ఆ తర్వాత నాగ శౌర్య అధికారికంగా నందమూరి ఫ్యామిలీ తో నాకు చుట్టరికం ఉందని ఎప్పుడూ చెప్పలేదు. నాగశౌర్య చెప్పనప్పటికీ వార్తలు మాత్రం నెట్టింట్లో జోరుగా సాగాయి. ఇక ఈ వార్తలను నాగశౌర్య తల్లి ఒక మాట తో కొట్టిపారేసింది. నాగశౌర్య తల్లి ఉష ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూ లో ఆ విషయం గురించి వెల్లడించింది.

Naga shourya- Jr NTR: హీరో నాగ శౌర్య, ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి.. ఇద్దరు బంధువుల?
Naga shourya- Jr NTR: హీరో నాగ శౌర్య, ఎన్టీఆర్ కు సంబంధం ఏంటి.. ఇద్దరు బంధువుల?

Naga shourya- Jr NTR: జూనియర్ ఎంటీఆర్ కి నాగ సౌర్య కు ఈ సంబంధం ఉందని ఉష తెలిపింది!

జూనియర్ కి నాగ శౌర్య కు ఎలాంటి బంధుత్వం లేదని చెప్పుకు వచ్చింది. ఇక నందమూరి ఫ్యామిలీ అంటే నాగ శౌర్య కు కొంత అభిమానం ఉందని తెలిపింది. ఇక నాగశౌర్య తల్లి మాటలు విన్న వారు ఒక్కసారిగా ఆ ఆలోచనలకు బ్రేక్ ఇచ్చుకున్నారు. ఇక నాగ శౌర్య రాబోయే సినిమాల వైపు ఒక లుక్కేద్దాం.

కృష్ణ వింద విహారి.. అనే సినిమాలో నాగ శౌర్య హీరోగా ప్రేక్షకులను మెప్పించ బోతున్నాడు. కాగా ఈ సినిమాకు డైరెక్టర్ అనీష్ ఆర్కే దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నాగ శౌర్య తెలుగు ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తాడో చూడాలి.

- Advertisement -