Nagababu: మెగా బ్రదర్ నాగబాబు తాజాగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మెగాస్టార్ చిరంజీవి వైసిపి నేతలను ఉద్దేశిస్తూ మీరు ప్రత్యేక హోదా పైన అలాగే రాష్ట్ర అభివృద్ధి పైన దృష్టి పెడితే బాగుంటుంది అంటూ విమర్శలు చేశారు దీంతో వైసిపి నేతలు ఒక్కొక్కరిగా మీడియా సమావేశాలను ఏర్పాటు చేస్తూ మెగాస్టార్ చిరంజీవి పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపించారు. ఇలా చిరంజీవి పట్ల విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో నాగబాబు రంగంలోకి దిగి సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలకు షాక్ కౌంటర్ ఇచ్చారు.
ఈ సందర్భంగా నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. శ్రమను పెట్టుబడిగా పెట్టి పన్ను అనా పైసతో సహా చెల్లించి…వినోదాన్ని విజ్ఞానాన్ని జనాలకు పంచిపెట్టే 24 క్రాఫ్ట్ లకు కడుపునిండా భోజనం పెట్టే ఏకైక పరిశ్రమ చిత్ర పరిశ్రమ. ఏ పని పాట లేనోడు పిల్లి తల కొరిగినట్టు నిజం మాట్లాడిన వ్యక్తుల మీద విషం కక్కుతున్నారు.ప్రస్తుతం ఆయన గురించి విమర్శలు చేస్తున్నటువంటి ఆంధ్ర మంత్రులు ఒకానొక సమయంలో ఆ అన్నయ్యతో ఫోటో దిగడం కోసం పడిగాపులు కాచిన వారేనంటూ నాగబాబు ఫైర్ అయ్యారు.
Nagababu: మీ బతుక్కు శాఖలపై అవగాహన లేదు…
ఆకాశం పై ఉమ్ము వేయాలని చూస్తే అది మీ మీదకే పడుతుంది.. మీ బతుక్కు శాఖలపై ఏమాత్రం అవగాహన లేదు.. అభివృద్ధి అనే పదానికి అర్థం తెలియదు. బటన్ నొక్కి కోట్లు ముంచేసి 1000 మందికి పథకాలు అందిస్తే అదే అభివృద్ధి అనుకుంటున్నారు అభివృద్ధి చేయడానికి ఇంకేమీ లేదా… మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటేనే అర్థమవుతుంది. మీ దౌర్భాగ్యపు ధర్మాలను పాలనకు ఎండ్ కార్డు పడే రోజులు దగ్గర పడుతున్నాయి…కాలం కాలం ఏస్తే ప్రకృతి కూడా శత్రువే అంటూ ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి నేతలను ఉద్దేశిస్తూ నాగబాబు చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనగా మారాయి.