Nagababu: టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా బ్రదర్ నాగబాబు నటుడిగా మంచి గుర్తింపు పొందిన సంగతి అందరికీ తెలిసింది. అంతేకాకుండా బుల్లితెర మీద ప్రసారమైన కామెడీ షోలకు జడ్జ్ గా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకులకు కూడా బాగా దగ్గరయ్యాడు. ఇక ప్రస్తుతం అడపా దడపా సినిమాలలో నటిస్తున్న నాగబాబు రాజకీయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాడు. తమ్ముడు పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. అయితే ఇటీవల నాగబాబు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక పోస్ట్ తీవ్ర విమర్శలకు తావిస్తోంది. నాగబాబు చేసిన ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యలు పొలిటికల్ వార్ కి కారణం అయ్యాయి.
నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీలో పార్టీ జనరల్ సెక్రటరీగా ఒక బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్నాడు.అయితే ఇలా బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న నాగబాబు ఇలాంటి పరుష వ్యాఖ్యలు చేయడం వలన విమర్శలపాలు కావాల్సి వస్తుంది. అసలు విషయం ఏమిటంటే..ఇటీవల నాగబాబు వేట కొడవలి చేతపట్టుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ “మంచి అనేది విఫలం చెందినప్పుడు న్యాయం, శాంతి సాధించడానికి హింసే మార్గం” అంటూ ఒక వైలెంట్ పోస్ట్ షేర్ చేశాడు. అయితే నాగబాబు షేర్ చేసిన ఈ పోస్ట్ ఇతరులను రెచ్చగొట్టే విధంగా ఉంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఈ వ్యాఖ్యలు చర్చకు దారితీసాయి.
Nagababu: రాజకీయ చర్చలకు దారి తీసిన నాగబాబు పోస్ట్…
నాగబాబు దుందుడుకు స్వభావం వల్ల ఇప్పటికే పలుమార్లు విమర్శలు ఎదుర్కున్నాడు. ఇక ఇప్పుడు ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయటంతో.. పబ్లిక్ లో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నేరమని కొందరు తమ అభిప్రాయం తెలుపుతున్నారు. అయితే జన సైనికులు మాత్రం నాగబాబు చేసిన పోస్ట్ చూసి ఆవేశంతో ఊగిపోతున్నారు. ఈ మాత్రం ధైర్యం ఇస్తే చాలు ఇక రెచ్చిపోతామంటు కయ్యానికి కాలు దువ్వుతున్నారు. ఇక నాగబాబు షేర్ చేసిన ఈ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక నాగబాబు చేసిన వ్యాఖ్యల పై వైసిపి నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.