Nagababu: మెగా బ్రదర్ గా ఇండస్ట్రీలో కొనసాగుతూ నటుడిగా నిర్మాతగా గుర్తింపు పొందిన నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీకి మద్దతు తెలుపుతూ పార్టీ కార్యకలాపాలలో ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు.ఇలా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నాగబాబు మెగా ఫ్యామిలీ గురించి ఎవరైనా మాట్లాడితే వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతూ ఉంటారు. ఇకపోతే నాగ బాబు నిర్మాణ సాధ్యంలో రామ్ చరణ్ నటించిన చిత్రం ఆరెంజ్.ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ డిజాస్టర్ సినిమాగా నిలవడంతో పెద్ద ఎత్తున ఈ సినిమా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంది.
ఈ సినిమా వల్ల వచ్చిన నష్టాల ద్వారా నాగబాబు ఎంతో నష్టపోయారని ఒకానొక సమయంలో ఆత్మహత్య కూడా చేసుకోవాలని భావించారని అయితే ఆ సమయంలో చిరంజీవి పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచారని వెల్లడించారు. చిరుత మగధీర వంటి మంచి సక్సెస్ సినిమాలతో దూసుకుపోతున్న రామ్ చరణ్ కు ఆరెంజ్ సినిమా భారీ ఫ్లాప్ అందించింది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన తిరిగి వరుస సినిమాలలో నటిస్తూ తన సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఇకపోతే తాజాగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా తిరిగి ఆరెంజ్ సినిమాని విడుదల చేయాలని భావించినప్పుడు నాగబాబు కాస్త ఆలోచనలో పడ్డారని తాజాగా ఈయన ఈ సినిమా రిలీజ్ గురించి వెల్లడించారు.
Nagababu ఆరెంజ్ సినిమా కూడా హిట్ అయినట్లే…
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ ఈ సినిమా రీ రిలీజ్ చేద్దాం అంటే కాస్త ఆలోచనలో పడ్డానని అయితే ధైర్యం చేసి ఈ సినిమాని తిరిగి విడుదల చేశామని తెలిపారు.ఇలా ఈ సినిమా తిరిగి విడుదల కావడంతో ఊహించని రీతిలో కలెక్షన్లు వచ్చాయని నాగబాబు తెలిపారు. ఈ సినిమా మొదటిసారి విడుదలైనప్పుడు వరుస హిట్టు సినిమాలతో దూసుకుపోతున్న చరణ్ కు నావల్ల సక్సెస్ దూరమైందనే బాధ నన్ను ఎంతగానో వెంటాడింది అయితే ఈ సినిమా తిరిగి విడుదలై ప్రేక్షకులు మంచిగా ఆదరించడంతో ఈ సినిమా కూడా హిట్ ఖాతాలోకి వెళుతుందని, చరణ్ కు నావల్ల సక్సెస్ దూరమైందన్న బాధ తీరిపోయిందని ఈ సందర్భంగా నాగబాబు చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.