Nagabau: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతో మంచి క్రేజ్ ఉంది.ఇలా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎంతో మంచి సక్సెస్ సాధించి తన బాటలోనే తన సోదరులను కూడా ఇండస్ట్రీలోకి తీసుకెళ్లారు. అయితే వీరిలో పవన్ కళ్యాణ్ హీరోగా ఎంతో మంచి సక్సెస్ అయ్యారు. నాగబాబు పలు సినిమాలలో నటించిన పెద్దగా సక్సెస్ కాకపోవడంతో ఈయన నిర్మాతగాను అలాగే పలు సినిమాలలో సహాయ నటుడు పాత్రలలోనూ నటిస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగబాబుకు ఇద్దరు సంతానం అనే విషయం మనకు తెలిసిందే. కూతురు నిహారిక గురించి అందరికీ సుపరిచితమే ఇక కుమారుడు వరుణ్ తేజ్ హీరోగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించారు.
ఇలా తన పిల్లలే ప్రాణంగా బ్రతుకుతున్నటువంటి నాగబాబు ఈ మధ్యకాలంలో తన కూతురు కారణంగా కాస్త మనస్థాపానికి కూడా గురయ్యారని తెలుస్తోంది. ఇకపోతే నాగబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన కూతురు కారణంగా తను చేసిన పనికి ఆత్మహత్య చేసుకోవాలని భావించానని అయితే వరుణ్ తేజ్ ను చూసి తన ఆలోచన మార్చుకున్నాను అంటూ ఓ సందర్భంలో వెల్లడించారు. అసలు నిహారిక చేసిన పనికి నాగబాబు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు అనే విషయానికి వస్తే..
Nagabau: న్యూజిలాండ్ లో తప్పిపోయిన నిహారిక…
నిహారిక వరుణ్ తేజ్ ఇద్దరు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు ఫ్యామిలీతో కలిసి నాగబాబు న్యూజిలాండ్ వెళ్లారట. అయితే న్యూజిలాండ్ వెళ్లిన తర్వాత అచ్చం నాలాగే ఓ వ్యక్తి డ్రెస్ వేసుకొని ఉండడంతో నిహారిక నేనే తాను అనుకొని ఆ వ్యక్తితో పాటు వెళ్లిపోయిందని తెలియజేశారు. దాదాపు నిహారిక కోసం 20 నిమిషాల పాటు వెతికామని అయినా నిహారిక కనిపించకపోవడంతో ఆ క్షణం నాకేమీ తోచలేదని నాగబాబు తెలిపారు. ఆ క్షణం తన కూతురు కనిపించకపోవడంతో తన కూతురు లేని జీవితం నాకు అవసరం లేదన్న ఆలోచనలు తనకు వచ్చాయని కానీ వరుణ్ తేజ్ ను చూసి తన ఆలోచన తప్పని నిర్ణయించుకున్నానని ఈ సందర్భంగా తన కూతురిపై ఉన్న ప్రేమను బయటపెడుతూ నాగబాబు చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.