Nagachaitanya: అక్కినేని వారసుడు నాగచైతన్య ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో వరుస సినిమాలు చేస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన హిట్ ఫ్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాగచైతన్య తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో కస్టడీ అనే సినిమాలో నటించిన విషయం మనకు తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులన్నింటినీ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా మే 12వ తేదీ విడుదలకు సిద్ధమవుతోంది.
ఈ విధంగా వృత్తిపరమైన జీవితంలో ఎంతో బిజీగా ఉన్నటువంటి నాగచైతన్య వ్యక్తిగత జీవితానికి వస్తే ఈయన సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత కొంతకాలానికి విడాకులు ఇచ్చారు. ఇలా విడాకులు ఇచ్చినటువంటి నాగచైతన్య సమంతతో విడిపోయిన తర్వాత తన తండ్రి నాగార్జున ఇంట్లోనే ఉంటున్నారు. అయితే తనకంటూ ఒక ఇల్లు ఉండాలని భావించిన నాగచైతన్య తన డ్రీమ్ హౌస్ నిర్మించుకున్నారు. స్విమ్మింగ్ పూల్ థియేటర్ వంటి అన్ని అధునాతనమైన సౌకర్యాలతో ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నారని తెలుస్తుంది.

Nagachaitanya: రెండో పెళ్లి పై స్పందించని చైతూ…
నాగార్జున ఇంటికి దగ్గరలోనే నాగచైతన్య తన అభిరుచులకు అనుగుణంగా ఈ ఇంటిని నిర్మించుకోవడమే కాకుండా తాజాగా ఈ ఇంట్లోకి అడుగుపెట్టినట్టు తెలుస్తుంది.ఇలా విడాకులు తీసుకున్న తర్వాత నాగచైతన్య తనకంటూ ఓ సొంత ఇంటిని నిర్మించుకొని ఆ ఇంట్లోకి అడుగు పెట్టారట. ఇకపై నాగచైతన్య ఒంటరిగా ఈ ఇంట్లోనే ఉండబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈయన మాత్రం కొత్త ఇంట్లోకి ప్రవేశించినప్పటికీ ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా సైలెంట్ గా నూతన గృహప్రవేశం చేసినట్టు తెలుస్తుంది.ఇలా సమంతతో విడాకులు తీసుకున్న తర్వాత తరచూ ఈయన రెండో పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నా కానీ ఇప్పటివరకు నాగచైతన్య మాత్రం తన రెండవ పెళ్లి గురించి ఎక్కడ స్పందించలేదు.