Nagachaitanya: హోరాహోరి అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యి ఆ తర్వాత హుషారు అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దక్షా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇక నాగచైత్య, నాగార్జున కలిసి నటించిన బంగార్రాజు సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. బంగార్రాజు సక్సెస్ మీట్ సమయంలో నాగ చైతన్యకు కళ్ళతో సైగలు చేసి బాగా పాపులర్ అయ్యింది. దీంతో వీరి మధ్య ఏదో జరుగుతోందని వార్తలు కూడా వినిపించాయి. అంతే కాకుండా ఈ ఇద్దరు లవ్ లో ఉన్నారంటూ ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ వార్తలలో నిజం లేదని దక్ష క్లారిటీ ఇచ్చింది.
ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర సినిమాలో కూడా ఒక కీలకపాత్రలా నటిస్తోంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దక్షా నాగచైతన్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ఇంటర్వ్యూలో దక్షా మాట్లాడుతూ.. చైతన్య లాంటి అబ్బాయిని ప్రతి అమ్మాయి కోరుకుంటుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అంతే కాకుండా చైతూ లాంటి సింపుల్ పర్సన్ తోడుగా ప్రతి అమ్మాయి కావాలనుకుంటుంది. ఎందుకంటె అతను అమ్మాయిల విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు అని తెలిపింది.
Nagachaitanya అమ్మాయిలంటే గౌరవం…
అంతే కాకుండా అమ్మాయిల పట్ల ఎంతో గౌరవంగా ఉంటాడని, బంగార్రాజు మూవీ షూటింగ్ లో నన్ను హగ్ చేసుకోవడానికి.. ముద్దులు పెట్టుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు అంటూ తెలిపింది దక్షా. అలాంటి సన్నివేశాలు చేసినప్పుడు షూటింగ్ తర్వాత సారీ చెప్పేవాడని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ప్రస్తుతం నాగచైతన్య గురించి దక్షా చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండు దక్ష సినిమా అవకాశాల కోసం తరచూ తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో ఈ అమ్మడు షేర్ చేసే గ్లామర్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.