Nagachaitanya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ నటులు అయినటువంటి ఎన్టీఆర్ ఏఎన్నార్ ఎ ఎస్వీఆర్ వంటి హీరోల మధ్య ఎలాంటి మనస్పర్ధలు లేకుండా ఎంతో స్నేహభావంతో ఉండేవారు. అయితే వీరు వారసులుగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున బాలకృష్ణ మధ్య కూడా అలాంటి అనుబంధమే ఉండేది అయితే వీరిద్దరి మధ్య ఏదో మనస్పర్ధలు రావడం చేత ఇద్దరీ మధ్య మాటలు లేవని గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఇకపోతే తాజాగా బాలకృష్ణ మరోసారి అక్కినేని ఫ్యామిలీ పై బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం తీవ్రదుమారం రేపుతున్నాయి.
బాలకృష్ణ తాజాగా నటించిన వీర సింహారెడ్డి సినిమా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా ఈయన మాట్లాడుతూ ఆ రంగారావు ఈ రంగారావు అక్కినేని తొక్కినేని అంటూ నోరు జారారు.అయితే ఈయన ఉద్దేశపూర్వకంగా ఇలా మాట్లాడారా లేక పొరపాటున ఇలా జరిగిందో తెలియదు కానీ బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో తీవ్రదుమారం రేపాయి.అక్కినేని నాగేశ్వరరావు జయంతి రోజున ఆయన ఫ్యామిలీని కించపరుస్తూ బాలయ్య ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర స్థాయిలో బాలయ్య పై ఫైర్ అవుతున్నారు.
Nagachaitanya: మనల్ని మనం కించపరచుకోవడమే…
ఈ క్రమంలోనే బాలకృష్ణ అక్కినేని ఫ్యామిలీ గురించి చేసినటువంటి ఈ వ్యాఖ్యలపై నాగచైతన్య కూడా స్పందిస్తూ బాలకృష్ణకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు. నాగచైతన్య ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు గారు మన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డలు. వారిని అగౌరవపరచడం మనల్ని మనం కించపరచుకోవడమే అంటూ పరోక్షంగా బాలకృష్ణపై ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.