Nagachaitanya: టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అక్కినేని వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగచైతన్య మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుని సినిమా అవకాశాలను అందుకుని ఇండస్ట్రీలో నటుడిగా గుర్తింపు పొందారు.ఇలా ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్న సమయంలో నటి సమంతతో ప్రేమలో పడిన నాగచైతన్య కొన్ని రోజులపాటు ప్రేమలో ఉండి అనంతరం పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు.4 సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగినప్పటికీ కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ విధంగా ఈ జంట విడాకులు తీసుకోవడానికి సమంత వ్యవహారశైలి కారణమని పెద్దఎత్తున సమంత గురించి నెగిటివ్ కామెంట్లు వచ్చాయి.అయితే తన గురించి ఈ విధమైనటువంటి నెగిటివ్ కామెంట్ చేసే వారి పట్ల సమంత ఏ విధంగానూ స్పందించకపోవడమేకాకుండా తన మనసులో ఉన్న బాధను పోస్టుల రూపంలో బయట పెట్టేవారు.ఇక ఈ విడాకుల బాధ నుంచి బయటకు వచ్చిన సమంత పుష్ప సినిమాలో ఐటమ్ సాంగ్ ద్వారా వెండితెరపై ప్రేక్షకులని సందడి చేశారు. ఇలా ఐటమ్ సాంగులో నటించడమే కాకుండా ఏకంగా బోల్డ్ ఫోటోషూట్స్ జరుపుకొని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ చేస్తున్నారు. ఈ విధంగా సమంత భారీ ఎక్స్పోజింగ్ చూస్తూ తట్టుకోలేకనే నాగచైతన్య సమంత పై రివర్స్ అటాక్ కు సిద్ధమయ్యారు.

Nagachaitanya: సమంత టార్చర్ తట్టుకోలేకే
ఇలా గ్లామర్ షో చేస్తూ సమంత రెచ్చిపోతుండగా నాగచైతన్య మాత్రం రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ క్రమంలోనే నటి శోభితా ధూళిపాలితో చైతన్య ఎంతో చనువుగా ఉంటున్నారని ఆమెకోసం పలుసార్లు తనని కలవడానికి వెళ్లారని పెద్దఎత్తున వార్తలు షికార్లు చేస్తున్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి. సమంత గ్లామర్ షో చేస్తూ చేసే పనులను చూసి తట్టుకోలేక నాగచైతన్య ఇలా మరొకరితో డేటింగ్ లో ఉంటూ రెండవ పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డారని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ రెండో పెళ్లి వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.