Nagarjuna: అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలోకి అఖిల్ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చిన అఖిల్ తాజాగా ఏజెంట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. ఇక ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ఏప్రిల్ 28వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకను వరంగల్ లోఎంతో ఘనంగా నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ కార్యక్రమానికి నాగార్జున ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అలాగే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ కూడా ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అఖిల్ గురించి నాగార్జున చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అఖిల్ ఏజెంట్ సినిమా కోసం భారీ స్థాయిలో కష్టపడిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా కోసం ఈయన సిక్స్ ప్యాక్ బాడీ కోసం దాదాపు పది నెలల పాటు కష్టపడ్డాను అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారు. ఇలా ఈ సినిమా కోసం అఖిల్ ఎంతోక ష్టపడిన విషయాన్ని నాగార్జున గుర్తుచేస్తూ అఖిల్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటారని తెలిపారు. చిన్నప్పటి నుంచి తాను ఎంతో చలాకీగా ఉండేవాడని తెలియజేశారు.
Nagarjuna: ఆయన ఓకే చెబితే సినిమా హిట్టు…
ఇక అఖిల్ కడుపులో ఉన్న సమయంలోనే తన ఎనర్జీ ఏంటో మాకు తెలిసిపోయిందని అమల ఎనిమిదవ నెల ప్రెగ్నెంట్ అయినప్పుడు అఖిల్ ఏ మాత్రం నిద్రపోకుండా కదులుతూనే చాలా యాక్టివ్ గా ఉండేవారని తెలిపారు. ఇలా తాను కడుపులో ఉంటూ అమలను చాలా ఇబ్బందులకు గురి చేశారని దాంతో మేము భయపడి డాక్టర్ వద్దకు పరుగులు పెట్టగా ఆయన అఖిల్ ను సాయిల్ లో పెట్టి తన ఎనర్జీని బయటకు తీసుకురావాలని చెప్పేవారు. అదే విధంగానే సురేందర్ రెడ్డి అఖిల్ లో ఉన్న ఎనర్జీని మొత్తం బయటకు తీసారని తెలియజేశారు.ఇక ఈ సినిమాలో మమ్ముట్టి వంటి స్టార్ హీరో నటించారు. ఆయన ఒక సినిమాకు ఓకే చెప్పారు అంటే ఆ సినిమా పక్క హిట్ అయినట్లేనని ఈ సందర్భంగా నాగార్జున ధీమా వ్యక్తం చేశారు. ఈ వేడుకలో భాగంగా నాగార్జున చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.