Nagarjuna: తెలుగు సినీ ప్రియులకు కింగ్ నాగార్జున గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. దాదాపు తెలుగులో 80 సినిమాలకు పైగా నటించి నటనలోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఇదే క్రమంలో నాగార్జున ఎంతో మంది అభిమానులను తన సొంతం చేసుకున్నాడు. దాదాపు ఆరు పదుల వయసు దాటినా ఇప్పటికీ నాగార్జున టాలీవుడ్ యంగ్ హీరోలతో సమానంగా సినిమా ఛాన్సులు కొట్టేస్తూ ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్నాడు.
ఒకప్పుడు మంచి హిట్ లతో దూసుకెళ్లిన నాగార్జున ఇప్పుడు అంతగా సక్సెస్ అందుకోలేక పోతున్నాడు. గత ఏడాది విడుదలైన వైల్డ్ డాగ్ సినిమాతో అంత సక్సెస్ అందుకోలేకపోయాడు. ఆ తర్వాత బంగార్రాజు సినిమాలో నటించగా ఈ సినిమా కొంత వరకు పర్వాలేదు అనిపించింది. నిజానికి ఈ సినిమాలో ఊహించిన దాని కంటే తక్కువ స్థాయిలో సక్సెస్ రావటంతో నాగార్జున నిరాశగానే ఉన్నట్లు తెలుస్తుంది.

Nagarjuna: ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్న నాగార్జున..
దీంతో నాగార్జున ప్రస్తుతం ఇప్పుడు నటించే సినిమాతో అయిన మంచి సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు. ప్రస్తుతం నాగార్జున గరుడవేగ ఫేమ్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది గోస్ట్ అనే సినిమాలో నటిస్తున్నాడు. శ్రీ వెంకటేశ్వర సినిమా ఎల్ ఎల్ పీ నార్త్ స్టార్ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇందులో నాగార్జున సరసన సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక ఇటీవల ఈ సినిమా కొంత భాగం షూటింగ్ ను దుబాయ్ లో పూర్తి చేసుకుంది. ఈ సినిమా యాక్షన్ నేపథ్యంలో రూపొందుతుంది. ఇక నాగార్జున ప్రస్తుతం ఈ సినిమాపై బాగా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా ఈ సినిమాతో మంచి సక్సెస్ అందుకొని మళ్లీ మునుపటిలా ఉన్న ట్రాక్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నాడు. మరి నాగార్జున ఆశలను డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు ఏ విధంగా తీరుస్తాడో చూడాలి. ఒకవేళ ఈ సినిమా ఫ్లాప్ అయితే మాత్రం నాగార్జున ఫ్యూచర్ ఏంటో ఇప్పుడే అర్థం అవుతుంది.