Nagarjuna: సమంత నాగచైతన్య విడిపోయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ గురించి రోజు ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంది. ఇక సమంత నుంచి విడాకులు తీసుకున్న నాగచైతన్య మరొక నటి శోభిత ధూళిపాళ్లతో డేటింగ్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇలా చైతన్య శోభిత డేటింగ్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న తరుణంలో శోభిత ఒకానొక సమయంలో ఈ వార్తలను ఖండించే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరూ లండన్ లో ఒక రెస్టారెంట్లో కలిసి ఉన్నటువంటి ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
ఇలా ఈ ఫోటో ద్వారా వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నారంటూ అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. అయితే శోభిత నాగచైతన్య వివాహం జరగాలంటే నాగార్జున నటి శోభితకు రెండు కండిషన్లు పెట్టారని ఆ కండిషన్ లో కనుక ఒప్పుకుంటే నాగచైతన్యతో పెళ్లి చేయడానికి తనకు ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదని తెలియజేశారట. అయితే నాగార్జున పెట్టిన కండిషన్లు ఏంటి అందుకు శోభిత ఒప్పుకున్నారా అనే విషయానికి వస్తే… అక్కినేని కోడలుగా వచ్చే అమ్మాయి సినిమాలలో నటించకూడదట. ఇలా నాగచైతన్యను పెళ్లి చేసుకుంటే సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది.
Nagarjuna: అక్కినేని కోడలుగా శోభిత..
ఇలా నాగార్జున సినిమాలకు దూరంగా ఉండాలని కండిషన్ పెట్టడంతో అందుకు శోభిత కూడా ఒప్పుకున్నట్లు సమాచారం.ఇకపోతే పెళ్లి తర్వాత జీవితాంతం ఇద్దరూ కలిసి మెలిసి ఉండాలని కండిషన్ పెట్టారట ఒకవేళ ఉండలేమనీ, గొడవలు చోటుచేసుకుని విడిపోయేలాగా ఉంటే పెళ్లికిముందే ఈ విషయం గురించి ఆలోచించి డ్రాప్ అవ్వడం మంచిదనే కండిషన్ పెట్టారట. అయితే దీనికి కూడా శోభిత ఒప్పుకున్నారని తెలుస్తోంది. ఇలా నాగార్జున పెట్టిన కండిషన్లకు శోభిత ఒప్పుకోవడంతో ఈమె త్వరలోనే అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.