Nagarjuna: నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో మన్మధుడిగా ఎంతో మంది లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నటువంటి నాగార్జునకు ఇప్పటికీ అదే స్థాయిలో మహిళా అభిమానులు ఉన్నారని చెప్పాలి.ఇలా నటుడిగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి నాగార్జున ఎప్పుడు చూసినా తన మొహం పై చిరునవ్వు కనపడుతూనే ఉంటుంది అలా చాలా ప్రశాంతంగా ఈయన కనిపిస్తారు. ఇక నాగార్జున ప్రస్తుతం ఒకవైపు సినిమాలు మరోవైపు బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
ఇదిలా ఉండగా తాజాగా నాగార్జునకు సంబంధించినఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎప్పుడు ప్రశాంతంగా చాలా కూల్ గా కనిపించే నాగార్జునకు కోపం వస్తే ఎలా బిహేవ్ చేస్తారో అన్న విషయాలను తన కుమారుడు అఖిల్ ఓ సందర్భంలో తెలియజేశారు. ఇలా నాగార్జునకు కోపం వస్తే అనే విషయం తెలియడంతో నాగార్జునకు కూడా కోపం వస్తుందా అని చాలామంది ఆశ్చర్యపోతున్నారు అయితే ఈయనకు కోపం వచ్చినప్పుడు మాత్రం ఈయన చేసే పని తెలిస్తే మాత్రం అందరూ షాక్ అవుతారు.
Nagarjuna: కిచెన్ లో ఉన్నారంటే కోపంగా ఉన్నట్టే…
ఈ సందర్భంగా నాగార్జున కోపం గురించి అఖిల్ మాట్లాడుతూ నాన్న చాలా వరకు కూల్ గా ఉండటానికి ప్రయత్నాలు చేస్తారు. ఇక ఆయనకు కనుక కోపం వచ్చింది అంటే వెంటనే కిచెన్ లోకి వెళ్లిపోయి కుకింగ్ స్టార్ట్ చేస్తారని అఖిల్ తెలిపారు. నాన్న చాలా బాగా వంటలు చేస్తారని అఖిల్ తెలిపారు.తాను ఎప్పుడైనా షూటింగ్ నుంచి ఇంటికి వచ్చే సమయానికి నాన్న కిచెన్ లో ఉన్నారు అంటే నాకు అప్పుడే మ్యాటర్ అర్థమవుతుంది ఆయన ఏదో విషయంలో చాలా సీరియస్ గానూ టెన్షన్ గానూ ఉన్నారని తెలిసిపోతుంది అంటూ ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో భాగంగా నాగార్జున కోపం గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.