Nagarjuna: నాగార్జునకు ఏమైంది.. ఆయన ముఖంపై మచ్చలు.. అనారోగ్యం.. కొడుకుల గురించి దిగులేనా?

Akashavani

Nagarjuna: టాలీవుడ్ ప్రేక్షకులకు హీరో నాగార్జున గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. దాదాపు ఎనభై నాలుగు సినిమాలకు పైగా నటించి తెలుగు ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక తన లుక్ తో ఎంత మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు నాగార్జున.

ప్రస్తుతం తన ఇద్దరు కొడుకుల తో సమానంగా హీరో రోల్స్ చేస్తూ తెలుగు ప్రేక్షకులను మరో లెవెల్ లో ఆకట్టుకుంటున్నాడు. మొత్తానికి నాగార్జున టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర స్టార్ట్ హీరోలలో తాను ఒకడిగా ఓ వెలుగు వెలుగుతున్నాడు. ఇక నాగర్జున ఏదో ఒక మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని తన మాటలతో బాగా హడావుడి చేస్తాడు. ఇక ఆయన దాదాపు 60 సంవత్సరాలు మీద పడినా.. చక్కటి అందంతో అభిమానులను ఉత్సాహ పరుస్తూ ఉంటాడు.

ఇక ప్రస్తుతం నాగార్జున లో మునుపటిలా జోష్ , తను నవ్వుతూ నవ్విస్తూ ఉండే ముఖం లో కల చెదిరి పోయాయి. ప్రస్తుతం నాగార్జున కు సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఫోటోను చూసిన నాగార్జున అభిమానులు ఒక రేంజ్ లో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా జయమ్మ పంచాయతీ సినిమా రిలీజ్ ఈవెంట్ కు నాగార్జున గెస్ట్ గా వెళ్ళాడు.

ఆ ఈవెంట్లో నాగార్జునను చూసిన ప్రతి ఒక్కరూ స్టన్ అవుతున్నారు. ఆ సమయంలో నాగార్జున ముఖమంతా దగ్గరగా ఉండి చాలా వయసు మీద పడినట్లు కనిపించాడు. ఇక నాగార్జున ను అలా చూసిన తన అభిమానులు ఎంతో బాధగా ఫీలవుతున్నారు. ఇక నాగార్జున అలా ఉండడానికి రెండు కారణాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నాయి.

Nagarjuna: నాగార్జున ముఖంపై మచ్చలు రావడానికి కారణాలు ఇవే!

ప్రస్తుతం గోస్ట్ సినిమాలో నటిస్తున్న నాగార్జున ఆ సినిమా షూటింగ్ వల్లే ఇలా మారిపోయాడని కొందరు చెబుతున్నారు. మరికొందరు గత కొన్ని రోజులుగా నాగార్జున తన ఇద్దరు కొడుకుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడని అందుకే తను ఇలా అయ్యాడు అని అనుకుంటున్నారు.

- Advertisement -