Namrata: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మహేష్ బాబుకి ఎంతో మంచి క్రేజ్ ఉంది. ఈయనకు మాత్రమే కాకుండా ఈయన ఫ్యామిలీకి కూడా ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని చెప్పాలి. మహేష్ బాబు సినిమా పనులతో బిజీగా ఉండగా నమ్రత మాత్రం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చెక్కబెడుతూ ఉంటారు. అయితే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే నమ్రత తనకు తన పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటారు.సితార గురించి సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
సితార గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు మహేష్ బాబు గారాల పట్టిక ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఈమె ఇంత చిన్న వయసులోనే విపరీతమైన చేసుకుంది.ఇకపోతే సితార తాజాగా తన సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేషన్ లోకి అడుగుపెట్టిందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలను నమ్రత సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తూ మురిసిపోతూ చేసినటువంటి పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Namrata: చాలా గర్వంగా ఉంది…
ఈ ఫోటోలను వీడియోలను షేర్ చేసిన నమ్రత నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది నాకు నా పాత రోజులు గుర్తుకొస్తున్నాయి. చిన్నప్పటినుంచి నిన్ను చూస్తూ ఉన్నా.. ఇప్పుడు నువ్వు కొత్తదశలోకి వెళ్తున్నావ్ సెకండరీ స్కూల్ గ్రాడ్యుయేట్ అవుతున్నందుకు కంగ్రాట్స్. ఇక నువ్వు అడుగు పెట్టిన ప్రతిచోట నీ కష్టంతో వెలిగిపోవాలని కోరుకుంటున్నాను. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలను అందుకోవాలని ఈమె ఆల్ ది బెస్ట్ చెప్పారు. అన్నయ్య డాడీ ఎప్పుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాము నీ ఎదుగుదలకు సహకరించిన టీచర్లకు కృతజ్ఞతలు అంటూ ఈ సందర్భంగా నమ్రత తన కుమార్తె గురించి చేసినటువంటి ఈ పోస్టు వైరల్ గా మారింది.