Namratha: టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నటువంటి మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మహేష్ బాబు ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఇంత బిజీగా ఉన్నారో ఇక ఈయన వంశీ సినిమాచేస్తున్న సమయంలో ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన బాలీవుడ్ నటి నమ్రతతో ప్రేమలో పడ్డారు ఇలా వీరిద్దరూ ప్రేమలో పడటం వీరి ప్రేమను కుటుంబ సభ్యులు తిరస్కరించడం జరిగింది అయితే అనంతరం తమ పెద్దలను ఒప్పించి వీరిద్దరూ వివాహం చేసుకున్నారు.
ఈ విధంగా వివాహం చేసుకున్నటువంటి నమ్రత మహేష్ బాబు తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు.నమ్రత బాలీవుడ్ హీరోయిన్గా ఎంతో మంచి గుర్తింపు పొందినప్పటికీ పెళ్లయిన తర్వాత తాను సినిమాలలో నటించకూడదని నిర్ణయం తీసుకున్నారు అందుకే ఈమె పెళ్లి తర్వాత కెమెరా ముందు కనిపించిన సందర్భాలు లేవు ఇలా సినిమాలకు దూరంగా ఉన్నటువంటి నమ్రత కేవలం ఇంటి బాధ్యతలను పిల్లల బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తూ మంచి ఇల్లాలిగా ఒక మంచి బాధ్యత గల తల్లిగా గుర్తింపు సంపాదించుకున్నారు.
Namratha:
ఇకపోతే నమ్రత ప్రస్తుతం తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉండగా ఈమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది నమ్రత పెళ్లి కాకముందు మరొక స్టార్ హీరోతో ప్రేమలో పడ్డారని వార్త వైరల్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీలో ఉన్న తర్వాత హీరో హీరోయిన్ల గురించి ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం మరి ఈమె ప్రేమలో ఉన్నటువంటి ఆ హీరో ఎవరు అనే విషయానికి వస్తే బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను నమ్రత ప్రేమించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.వీరిద్దరూ కలిసి పలు సినిమాలలో రొమాంటిక్ సన్నివేశాలలో నటించడంతో ఇలాంటి వార్తలు వచ్చాయి. ఈమె గురించి ఇలాంటి వార్తలు వస్తున్న తరుణంలోని కృష్ణ మొదట్లో మహేష్ బాబుతో పెళ్లికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. అయితే మహేష్ బాబుతో పెళ్లి అయిన తర్వాత ఈమె గురించి ఒక్క రూమర్ కూడా రాలేదని చెప్పాలి.