Namratha: సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత శిరోద్కర్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఎన్నో సినిమాలలో హీరోయిన్ గా నటించిన నమ్రత మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమై ఇంటి బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. మహేష్ బాబు వ్యాపారాలు, సినిమాలతో పాటు పిల్లల బాధ్యత కూడా తీసుకుంది. ఇలా నిత్యం బిజీగా ఉండే నమ్రత సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టిివ్ గా ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా అన్ని విషయాలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సోషల్ మీడియాలో షేర్ చేసిన పోస్ట్ ఒకటి వైరల్ గా మారింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రేక్షకులను అలరించటమే కాకుండా అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటూ తన మంచి మనసు చాటుకుంటున్నాడు. ఇప్పటికీ మహేష్ బాబు చారిటబుల్ ట్రస్ట్, మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మందికి విద్యా, వైద్య సదుపాయాలు అందిస్తున్నాడు. ఇక మహేష్ బాబు కూతురు సితార కూడా తన తండ్రి బాటలోనే పయనిస్తుంది. ఇటీవల గోల్డ్ జ్యువెలరీ యాడ్లో నటించిన సితార తన మొదటి రెమ్యూనరేషన్ ఒక చారిటీకి ఇచ్చినట్లు తెలిపింది. అంతేకాకుండా తాజాగా తన పుట్టిన రోజు వేడుకని కూడా మహేశ్ బాబు ఫౌండేషన్ విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు. అలాగే తన పుట్టిన రోజు సందర్భంగా మహేష్ బాబు స్వగ్రామమైన బుర్రిపాలెం జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినిలకు సైకిళ్లు కూడా పంపిణీ చేశారు.
Namratha: సంతోషం తీసుకొచ్చిన సితార…
ఈ క్రమంలో దీనికి సంబంధించిన ఫోటోని నమ్రత తన ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ఓ నోట్ రాసుకొచ్చింది. ‘ఈ 40 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. మీరంతా పాఠశాలకు సైకిల్‌పై వెళ్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మన చదువును ఆనందంగా నేర్చుకోవడానికి ఇలాంటివి అవసరం. మీ కళ్లలో సంతోషం తీసుకొచ్చిన సితారకు, మహేశ బాబు ఫౌండేషన్‌కు ధన్యవాదాలు. ‘అంటూ నమ్రత తన కూతురికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. మహేష్ బాబు అభిమానులు కూడా సితార చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్నారు.